యాదాద్రి లక్ష్మీనరసింంహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌.. ఆలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్‌ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..

యాదాద్రి లక్ష్మీనరసింంహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌.. ఆలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
Follow us
K Sammaiah

|

Updated on: Mar 04, 2021 | 1:01 PM

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్‌ పంచనారసింహ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వద్ద ముఖ్యమంత్రి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్న టెంపుల్‌ సిటీ యాదాద్రిని నిర్మిస్తుంది. రేయింబవళ్లు సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించడం ప్రాధాన్యతనున సంతరించుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుదిమెరుగుల పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలు పరిశీలిస్తారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.

సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిశ్చయించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. సీఎంవో నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం, పది రోజులుగా కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానాలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటం, మరో మూడు మాసాల్లో ఉద్ఘాటనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు.

యాదాద్రి ప్రధానాలయం, పురవీధులు, శివాలయం, పుష్కరిణితో పాటు రింగురోడ్డు నిర్మాణం, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ కారణంగా కేవలం వైటీడీఏ, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులకే పరిమితమై సీఎం పరిశీలన చేస్తున్నారు. ఏయే పనులు పూర్తికావల్సి ఉంది, ఎన్ని రోజుల్లో వాటిని పూర్తిచేస్తారని అధికారులతో చర్చిస్తున్నారు. పనుల తీరు తెలుసుకున్నాక చినజీయర్‌ స్వామితో చర్చించి ఆలయ ఉద్ఘాటనపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్ తరాల వారు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం అక్కడ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగుల పనులు చకాచకా సాగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. భూతల స్వరంలా మారిపోయింది.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజాకైంకర్యాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని.. ఆ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని సీఎం భావిస్తున్నారు.

Read More:

విభజన హామీని అటకెక్కించిన కేంద్రం.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళకోరుతనానికి నిదర్శనం-ఎంపీ బండప్రకాశ్‌

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!