TRS MP Banda Prakash : తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఢిల్లీకి బానిసగా ఉంటారా అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించిన ఎంపీ బండ ప్రకాష్
TRS MP Banda Prakash : తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు మరోసారి చర్చకు దారి తీసింది. దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ కేంద్రం ప్రకటించడంపై..
TRS MP Banda Prakash : తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు మరోసారి చర్చకు దారి తీసింది. దేశంలో ఎక్కడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ కేంద్రం ప్రకటించడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RTI కింద ఈ విషయంపై సమాధానం చెప్పిన కేంద్రం.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖంగా లేనట్లు స్పష్టం చేసింది. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళ కోరుతనానికి నిదర్శనం అంటున్నారు టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలోనే ఉందన్న ఆయన.. తెలంగాణకు ఆశచూపి మొండి చేయి చూపిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిజెపినాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఢిల్లీకి బానిసగా ఉంటారా అన్న ప్రకాశ్..కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని పార్లమెంట్ స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..