విభజన హామీని అటకెక్కించిన కేంద్రం.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళకోరుతనానికి నిదర్శనం-ఎంపీ బండప్రకాశ్‌

తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళ కోరుతనానికి నిదర్శనం అంటున్నారు టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలోనే..

విభజన హామీని అటకెక్కించిన కేంద్రం.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళకోరుతనానికి నిదర్శనం-ఎంపీ బండప్రకాశ్‌
Follow us
K Sammaiah

|

Updated on: Mar 04, 2021 | 12:30 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీలు నిప్పులు చెరుక్కుంటున్నారు. పట్టభద్రుల ఓటర్లే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న పార్టీలు.. ప్రధానంగా నిరుద్యోగ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. పట్టభద్రుల ఆకర్షించేందుకు ఉద్యోగాల కల్పనలో మీరు ఫెయిల్‌ అయ్యారంటే.. మీరు ఫెయిల్‌ అయ్యారని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఏపీ ఉనర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో బీజేపీ సర్కార్‌ విఫలమైందని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన పథకాలను ప్రారంభించి ఓటడగాలని బీజేపీకి టీఆర్‌ఎస్‌ సవాల్‌ విసురుతుంది. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన బీజేపీకి ఓట్లడిగే హక్కే లేదని అంటుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు మరోసారి చర్చకు దారి తీసింది. దేశంలో ఎక్కడా కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదంటూ కేంద్రం ప్రకటించడంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. RTI కింద ఈ విషయంపై సమాధానం చెప్పిన కేంద్రం.. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖంగా లేనట్లు స్పష్టం చేసింది.

తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమనడం బీజేపీ దివాళ కోరుతనానికి నిదర్శనం అంటున్నారు టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలోనే ఉందన్న ఆయన.. తెలంగాణకు ఆశచూపి మొండి చేయి చూపిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిజెపినాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఢిల్లీకి బానిసగా ఉంటారా అన్న ప్రకాశ్..కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని పార్లమెంట్‌ స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, షెడ్యూల్‌ 13లో తెలంగాణలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే హామీ ఉంది. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఆ హామీ అమలుకాలేదు. రైల్వే వ్యవస్థ ప్రైవేటీకరణ నేపథ్యంలో అసలు కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటే ప్రశ్నార్థకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోచ్‌ఫ్యాక్టరీ పరిస్థితి ఏమిటని తెలంగాణ ఎంపీలు పలుమార్లు ప్రశ్నించినా కేంద్రం నుంచి సమాధానం రావడంలేదు.

కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేకు ఎప్పుడూ అన్యాయమే చేస్తుందని రైల్వే ఉద్యోగులే చెప్తున్నారు. కొత్త రైళ్లు, లేన్లు, నిధుల కేటాయింపులను పట్టించుకోవడం లేదంటున్నారు. ఆదాయంలో అన్ని జోన్ల కంటే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతస్థానంలో కొనసాగుతున్నా ప్రత్యేక ప్రోత్సా హం లభించడం లేదని వాపోతున్నారు.

ఇక ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ అందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు మాత్ర శూన్యం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు కలుపుకొని కొత్త జోన్‌ ఏర్పాటుచేస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డివిజన్లు ఉంటాయి. తెలంగాణలో మిగిలేవి రెండు మాత్రమే కావడంతో కాజీపేట కేంద్రంగా మరో డివిజన్‌ ఏర్పాటుచేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Read More:

కాషాయం కప్పుకున్న కమ్యూనిస్టు… శారదాపీఠం దర్శనంపై ఇప్పుడేమి సమాధానం చెప్పుతావు నారాయాణా..?

సొంత పార్టీకి చెందిన మంత్రి ప్రకటన తెలియదంటావా..? ఏ అజ్జానంలో ఉన్నావు బండీ.. మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే