AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాషాయం కప్పుకున్న కమ్యూనిస్టు… శారదాపీఠం దర్శనంపై ఇప్పుడేమి సమాధానం చెప్పుతావు నారాయాణా..?

ఆయన కరుడు గట్టిన కమ్యూనిస్టు.. ఆయన ఏది చేసినా సంచలనమే.. ఆయనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయన ఇప్పుడు ఎవ్వరూ ఊహించని ఓ సంచలనం..

కాషాయం కప్పుకున్న కమ్యూనిస్టు... శారదాపీఠం దర్శనంపై ఇప్పుడేమి సమాధానం చెప్పుతావు నారాయాణా..?
K Sammaiah
|

Updated on: Mar 03, 2021 | 7:03 PM

Share

ఆయన కరుడు గట్టిన కమ్యూనిస్టు.. ఆయన ఏది చేసినా సంచలనమే.. ఆయనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయన ఇప్పుడు ఎవ్వరూ ఊహించని ఓ సంచలనం చేశారు. గతంలో గాంధీ జయంతి రోజు చికెన్ తిని.. ఏడాది పాటు చికెన్ తినడం మానేశారు ఆయన,. ఆ తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా విశాఖలోని శారదా పీఠంలో సీపీఐ నారాయణ ప్రత్యక్షమవ్వడం సంచలనంగా మారింది. ఏదో ఉద్యమం చేయాడానికో.. ఆశ్రమాన్ని ముట్టడించడానికనో వెళ్తే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు.. కానీ ఆయన అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకుని షాకిచ్చారు.

అదేంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు నారాయణ.. శారదాపీఠం వెళ్లి, తల వంచి మరీ స్వామీజీకి నమస్కారం చేయడం ఎర్రజెండా కామ్రేడ్‌లను విస్మయానికి గురి చేసింది. దీంతో నారాయణకు సాలువా కప్పి ఆశీర్వాదమందించారు స్వరూపానందేంద్ర స్వామి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోనూ జీవీఎంసీ ఎన్నికలైతే అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడి మేయర్ పీఠంపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి.

అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన సీపీఐ తాము పోటీ చేస్తన్న అన్ని స్థానాల్లో నెగ్గాలని కంకణం కట్టుకుంది. అందుకే జాతీయ నేతలు ప్రచారం బాట పట్టారు. ఇందులో భాగంగా ఆయన సీపీఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.. 97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన నారాయణ.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని శారదాపీఠంలో ఉన్న వారిని అభ్యర్థించారు. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అకస్మాత్తుగా శారదా పీఠంలో ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధరణంగా కమ్యూనిస్టులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆలయాలు, స్వామీజల వైపు చూడరు.. కానీ నారాయణకు ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఆయనీరోజు శారదాపీఠాన్ని సందర్శించడం సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని పనులు చేసి అందరికీ షాక్ ఇవ్వడం ఆయనకు ఆనవాయితీనే. గతంలో తిరుమలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే.. చాలాసార్లు తిరుమలకు వచ్చా.. కానీ, శ్రీవారిని దర్శించుకోలేదు. కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని సమాధానం ఇచ్చారు. ఇక ఇప్పుడు శారదాపీఠం దర్శనంపై ఎలాంటి సమాధానం చెబుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more:

విశాఖలో టీడీపీకి షాక్.. ఎమెల్యే గంటా శ్రీనివాసరావు కీలక అనుచరుడికి వైసీపీ తీర్థం