CPI Narayana challenges YSRCP : దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. వైసీపీకి సీపీఐ నారాయణ సవాల్
CPI Narayana challenges YSRCP : దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వైసీపీకి సవాల్ చేశారు సీపీఐ నారాయణ. నిజంగా బలం ఉంటే... బలవంతపు ఏకగ్రీవాలు కాదని, పోటీ చేసి గెలిచి..
CPI Narayana challenges YSRCP : దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వైసీపీకి సవాల్ చేశారు సీపీఐ నారాయణ. నిజంగా బలం ఉంటే… బలవంతపు ఏకగ్రీవాలు కాదని, పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం విశాఖలో పాదయాత్ర చేసిన వాళ్లే… ఢిల్లీలో పాద పూజ చేస్తున్నారని కామెంట్ చేశారు నారాయణ. అలాంటి వారిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో టీడీపీ, సీపీఐ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తున్న సందర్భంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా, బీజేపీ, జనసేన పొత్తుపైనా కామెంట్లు చేశారు నారాయణ. అటు, శారదా పీఠాధిపతి స్వరూపానందను తాను కలవడంపైనా నారాయణ రియాక్ట్ అయ్యారు. తమ అభ్యర్థి ప్రచారంలో భాగంగానే అక్కడికి వెళ్లామన్నారు. అందులో మరే ప్రత్యేకత లేదన్నారు. స్వరూపానందతో తానేం మాట్లాడానన్నది ఆయన్నే అడిగి తెలుసుకోవాలన్నారు నారాయణ. తాను చెప్పడం పద్ధతి కాదంటూ చెప్పుకొచ్చారు.
ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!
పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..