AP Municipal Elections, Nara Lokesh vs Vijayasai Reddy ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో కాక రేపుతున్న కార్పొరేషన్‌ ఎన్నికలు

AP Municipal Elections, Nara Lokesh vs Vijayasai Reddy : ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు కాక రేపుతున్నాయి. మూడు పార్టీలు... ఒకే అజెండాతో జనం దగ్గరకు వెళుతున్నాయి.

AP Municipal Elections, Nara Lokesh vs Vijayasai Reddy ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో కాక రేపుతున్న  కార్పొరేషన్‌ ఎన్నికలు
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 2:45 PM

AP Municipal Elections, Nara Lokesh vs Vijayasai Reddy : ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో కార్పొరేషన్‌ ఎన్నికలు కాక రేపుతున్నాయి. మూడు పార్టీలు… ఒకే అజెండాతో జనం దగ్గరకు వెళుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, మరో పక్షమైన జనసేన – బీజేపీ సైతం అభివృద్ధి నినాదాన్నే వినిపిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌తో విశాఖ రూపు రేఖలు మారిపోతాయని చెబుతోంది వైసీపీ. ఇన్నాళ్లు ఏం పీకారని ప్రశ్నించారు లోకేష్‌. విశాఖ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాళ్లు చేస్తోంది బీజేపీ. విశాఖ కార్పొరేషన్లోని 98 డివిజన్లలో అభివృద్ధి అజెండాగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.

ఇక, నెల రోజుల నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. విజయసాయిరెడ్డి ప్రత్యేక ఫోకస్‌ పెట్టి కాలనీల్లో తిరుగుతున్నారు. మంత్రులు అవంతి, కన్నబాబు, ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మెజార్టీ సీట్లు తమవేనన్న ధీమాతో ఉంది అధికార పార్టీ. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో టీడీపీని దెబ్బతీయాలని చూస్తోంది. మరోవైపు గ్రేటర్‌ విశాఖ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. గాజువాకలో రోడ్‌షో చేశారు. అభ్యర్థులతో కలిసి కాలనీలను చుట్టేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై సైటర్లు వేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు లోకేష్‌. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రకటించి 16 నెలలు అయింది… ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రోడ్డుపై చెత్త ఎత్త లేని వారికి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఎందుకని ప్రశ్నించారు. మేయర్‌ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు లోకేష్‌. అటు విజయసాయిపైనా కామెంట్స్‌ చేశారు లోకేష్‌. అసలు ఆయన వైసీపీలో ఉంటారో లేదో దేవుడికే తెలియాలన్నారు. బీజేపీ సైతం అభివృద్ధి నినాదాన్నే వినిపిస్తోంది. కేంద్ర సహకారంతోనే విశాఖ లాంటి నగరాలు అభివృద్ధి జరిగాయని చెబుతోంది. స్టీల్‌ సిటీ డెవలప్‌మెంట్‌పై బుక్‌లెట్‌ వేసి మరీ వైసీపీ, టీడీపీలకు సవాళ్లు విసిరింది కాషాయ దళం. మరి అభివృద్ధి అజెండాపై సవాళ్లకు వైసీపీ రియాక్ట్‌ అవుతుందా? ప్రభుత్వం వచ్చాక… తాము ఏం చేశామన్న దానిపై మంత్రులు స్పందిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది.

Read also : Hindupur MLA Balakrishna fire on Jagan Government : ఏపీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..