Dsc 2021 Notification: త్వరలో డీఎస్సీ… బ్యాక్‌లాగ్ టీచర్‌ పోస్టులు భర్తీ చేసే ఛాన్స్.. కసరత్తు మొదలు పెట్టిన విద్యాశాఖ

Dsc 2021: డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. త్వరలో డీఎస్సీ ప్రకటన ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు..

Dsc 2021 Notification: త్వరలో డీఎస్సీ... బ్యాక్‌లాగ్ టీచర్‌ పోస్టులు భర్తీ చేసే ఛాన్స్.. కసరత్తు మొదలు పెట్టిన విద్యాశాఖ
Dsc 2021 Recruitment
Follow us

|

Updated on: Mar 04, 2021 | 2:14 PM

Dsc 2021 Notification process: డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. త్వరలో డీఎస్సీ ప్రకటన ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.

రాష్ట్రంలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డీఎస్సీ, ఆ తర్వాత సాధారణ డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముందుగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఇందులో మిగిలిన వాటిని జనరల్‌కు మారుస్తారు. నియామక పరీక్షతోపాటే టెట్‌ నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించినా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఈసారి పాఠ్య ప్రణాళికనూ మారుస్తున్నారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇస్తున్నందున అభ్యర్థుల్లోని ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు.

ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. హేతుబద్దీకరణ, బదిలీల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను సేకరించారు. భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 16వేలకుపైగా ఖాళీ ఉన్నాయి. ఎన్నింటికి ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతుందో స్పష్టత రాలేదు. ఇటీవల సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలోనూ పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది.

బ్యాక్‌లాగ్‌ డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి రెండున్నర నెలల సమయం పడుతుంది. నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్‌కు మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చు.

డీఎస్సీ-2018లో ఆన్‌లైన్‌ నియామకాల కారణంగా ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పేపరు, పెన్నుతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. డీఈడీ, బీఈడీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులుగా ఉండడంతో దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. అందుకే గత డీఎస్సీలో ఎస్జీటీ నియామకాలకు 16 విడతలుగా పరీక్షలు నిర్వహించారు.

దీంతో కొన్ని విడతలకు ప్రశ్నపత్రం తేలికగా వచ్చిందంటే, మరికొన్ని సార్లు కఠినంగా వచ్చినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్జీటీ పరీక్షను ఒకే విడతలో నిర్వహించాలని నిర్ణయించారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు మాత్రం ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఉంటుంది.

ఇది కూడా చదవండి:

India vs England 4th Test Live: టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్ ఆధిక్యంలో టీమిండియా..

India vs England: నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లి – బెన్ స్టోక్స్ మధ్య గొడవ.. వీడియో వైరల్ Video