India vs England: నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లి – బెన్ స్టోక్స్ మధ్య గొడవ.. వీడియో వైరల్

virat clashed with stokes: నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ మ‌ధ్య చిన్నపాట వాగ్వాదం చోటు చేసుకుంది.

India vs England: నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లి - బెన్ స్టోక్స్ మధ్య గొడవ.. వీడియో వైరల్
virat kohli clashed with ben stokes
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 5:48 PM

Virat Kohli Clashed with Ben Stokes: మరోసారి అదే రచ్చ.. మాటల తూటాలు పేల్చారు ఇంగ్లీష్ ఆటగాళ్లు. ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ మ‌ధ్య చిన్నపాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ఔటైన త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్‌కు మ‌హ్మ‌ద్ సిరాజ్ ఓ బౌన్స‌ర్‌తో స్వాగత పలికాడు.

అదే సమయంలో బౌలింగ్ చేస్తున్న సిరాజ్‌ను బెన్ స్టోక్స్ కామెంట్ చేశాడు. ఇది తెలుసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దిగాడు. దీంతో కాసేపు స్టోక్స్‌తో కోహ్లీ వాదించాడు. ఇద్ద‌రి మ‌ధ్యా మాటామాటా పెర‌గ‌డంతో అంపైర్ మధ్యలో కల్పించుకున్నాడు. ఇద్దరిని నివారించేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంగ్లీష్ ఆటగాడు కొద్దిగా ముందుకు నడుస్తూ వాదించేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే విరాట్ తన సన్ గ్లాసెస్ తీసి ఇది పద్దతి కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.  ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనూ సిరాజ్‌, స్టోక్స్ మ‌ధ్య కాస్త మాట‌ల యుద్ధం న‌డిచింది.

ఇది కూడా చదవండి..

India vs England 4th Test Live: టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్ ఆధిక్యంలో టీమిండియా..

‘పింక్ రికార్డ్స్’ : ధోనీ రికార్డుకు విరాట్ కోహ్లీ బ్రేక్.. మోతేరా స్టేడియంలో మోత మోగించిన అశ్విన్‌, అక్షర్