India vs England: లోకల్ బాయ్ రూపంలో ఇంగ్లీష్ జట్టుకు ఎదురు దెబ్బ.. భోజన విరామ సమయానికి 74/3 (25)
నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి 3 వికెట్లను
IND vs ENG: నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి 3 వికెట్లను కోపోయి 74 పరుగులు చేసింది. ఒక దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ జట్టు.. బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో ఊపిరిపోశాడు.
5 ఓవర్లకు 10 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టును ఆరో ఓవర్‌లో అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే సిబ్లీ(2) బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు.
ఆ తర్వాత.. అక్షర్ పటేల్ రెండో వికెట్ కూడా తీశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్‌క్రాలే(9)ను ఔట్ చేశాడు. అతడు షాట్ ఆడగా మహ్మద్ సిరాజ్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియాకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ను మహ్మద్ సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. హైదరాబాదీ సిరాజ్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
క్రీజ్‌కి వచ్చిన స్టోక్స్ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన 15వ ఓవర్‌లో బెన్‌స్టోక్స్(14) మూడు ఫోర్లు కొట్టాడు. అలాగే ఓ నోబాల్ పడడంతో ఆ ఓవర్‌లో మొత్తం 13 పరుగులొచ్చాయి. అయితే స్ట్రోక్స్ పరుగుల వరదకు అశ్విన్ బౌలింగ్‌కు రావడంతో నెమ్మదిగా పరగుల వేగం తగ్గింది. మూడో టెస్ట్‌లాగే ఇంగ్లండ్‌ను స్పిన్‌తో బెదరగొట్టాలనుకున్న కెప్టెన్ కోహ్లి.. స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను త్వరగానే బౌలింగ్‌కు దించాడు.
ఈ ప్లాన్ ఫలించింది. పటేల్ వెంట వెంటనే ఓపెనర్లు క్రాలీ (9), సిబ్లీ (2)లను ఔట్ చేశాడు. ఆ వెంటనే పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (5)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఇంగ్లండ్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే అక్కడి నుంచి స్టోక్స్ (24 నాటౌట్), బెయిర్‌స్టో (28 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.