India vs England 4th Test Live: తొలి రోజు స్పిన్నర్లదే హవా..! 4 వికెట్లతో చెలరేగిన అక్షర్‌ పటేల్‌.. ఆట ముగిసే సమయానికి క్రీజులో నిలిచిన రోహిత్, పుజారా

Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Mar 04, 2021 | 7:48 PM

India vs England live: మొతేరాలో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్​లో 2-1తో టీిమిండియా ఆధిక్యంలో ఉంది. 

India vs England 4th Test Live:  తొలి రోజు స్పిన్నర్లదే హవా..!  4 వికెట్లతో చెలరేగిన అక్షర్‌ పటేల్‌.. ఆట ముగిసే సమయానికి క్రీజులో నిలిచిన రోహిత్, పుజారా

IND vs ENG: నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీమిండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. 205ల పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఒక దశలో 30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ జట్టు.. బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో ఊపిరిపోశాడు. అయితే అనంతరం కూడా భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోకల్‌ బాయ్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగో టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌కు గట్టి దెబ్బ కొట్టాడు. ఇక గత మూడు మ్యాచ్‌లలో తన స్పిన్‌తో మాయ జాలం చేసిన అశ్విన్‌ నాలుగో టెస్ట్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. హైదారాబాదీ ప్లేయర్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ను పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. దీంతో రోహిత్ , పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో తొలి రోజు ఆట ముగించింది. రోహిత్ శర్మ 8, చటేశ్వర పూజారా15 పరుగులతో క్రీజులో నిలిచారు. భారత్ ఇంకా 181 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ని అధిగమించవచ్చు. అయితే ఆఖరి 12 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

జట్టులోకి సిరాజ్‌..

వ్యక్తిగత కారణాలతో టీమిడియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా నాలుగో టెస్టుకు దూరమవడంతో మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. డామ్‌ బెస్‌, లారెన్స్‌ తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు.

టీమిండియా తుది జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, చెతేశ్వ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానె, రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ తుది జట్టు: డొమినిక్‌ సిబ్లీ, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌ (కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, ఓలిపోప్‌, బెన్‌ఫోక్స్‌, డానియల్‌ లారెన్స్‌, డొమినిక్‌ బెస్‌, జాక్‌లీచ్‌, జేమ్స్‌ అండర్సన్‌

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Mar 2021 05:06 PM (IST)

    తొలిరోజు ముగిసిన ఆట.. ఒక వికెట్ నష్టానికి 24/1

    టీమిండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 205 పరుగులకు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో తొలి రోజు ఆట ముగించింది. రోహిత్ శర్మ 8, చటేశ్వర పూజారా15 పరుగులతో క్రీజులో నిలిచారు. భారత్ ఇంకా 181 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ని అధిగమించవచ్చు. అయితే ఆఖరి 12 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

  • 04 Mar 2021 04:54 PM (IST)

    నిలకడగా ఆడుతున్న ఇండియా

    10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 18/1 పరుగులతో ఆడుతుంది. ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ ఔటయ్యేలా బంతులు విసురుతున్నారు. పూజారా 11, రోహిత్ 7 పరుగులతో ఆడుతున్నారు.

  • 04 Mar 2021 04:49 PM (IST)

    కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లాండ్

    ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔట్ కావడంతో రోహిత్ , పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. అయినప్పటికీ చెత్త బంతులను ఇద్దరు బౌండరీలకు పంపుతున్నారు. 8 ఓవర్లకు భారత్ 13 /1 పరుగులతో కొనసాగుతోంది. రోహిత్ 5, పూజారా 8 పరుగులతో ఆడుతున్నారు.

  • 04 Mar 2021 04:35 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న భారత్..

    టీమిండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు అలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు ఇండియా 4 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి కొనసాగుతోంది. రోహిత్‌ శర్మ, పూజారా ఆచితూచి ఆడుతున్నారు.

  • 04 Mar 2021 04:13 PM (IST)

    తొలి బౌండరీ కొట్టిన రోహిత్‌ శర్మ..

    మ్యాచ్‌ మొదైలన కాసేపటికే వికెట్‌ కోల్పోయిన టీమిండియాలో బౌండరీతో జోష్‌ నింపాడు రోహిత్‌ శర్మ. స్టోక్స్‌ వేసిన బంతిని బౌండరీకి పంపించి టీమిండియా స్కోర్‌ను బౌండరీతో మొదలు పెట్టాడు. ప్రస్తుతం భారత్‌‌ స్కోర్‌ రెండు ఓవర్లకు 4 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 04 Mar 2021 04:08 PM (IST)

    ఒక్క పరుగు లేకుండానే తొలి వికెట్‌..

    టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌ మొదలైన మూడో బంతికే శుభ్‌మన్‌ గిల్‌ అండర్సన్‌ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. టీమిండియా ప్రస్తుతం 1.2 ఓవర్లకు సున్న పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 04 Mar 2021 03:52 PM (IST)

    ఇంగ్లాండ్ అలౌట్.. ఫలించిన స్పిన్ మంత్రం..

    భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్‌ జట్టు కుప్పకూలింది. 205 పరుగులకు ఇంగ్లాండ్‌ ప్లేయర్స్‌ ప్యాకప్‌ చెప్పేశారు. చివరి వికెట్‌గా జాక్‌ లీచ్‌ వెనుతిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో జాక్‌ లీచ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు.

  • 04 Mar 2021 03:44 PM (IST)

    తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌.. అక్షర్‌ ఖాతాలో మరో వికెట్‌..

    భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్‌ క్రికెటర్లు వెనువెంటనే పెవిలియన్‌ దారి పడుతున్నారు. తాజాగా 70.04 ఓవర్‌లో అక్షర్‌ విసిరిన బంతికి.. డామినిక్ బెస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అక్షర్‌ పటేల్‌ తన మాయ కొనసాగిస్తున్నాడు. అతడు వేసిన 71వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. మొదటి బంతికి డేనియెల్‌ స్టంపౌట్‌ అవ్వగా నాలుగో బంతికి డామ్‌బెస్‌ ఔటయ్యాడు. దీంతో అక్షర్‌ ఖాతాలో నాలుగు వికెట్లు పడ్డాయి. 71 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 189/9తో ఉంది.

  • 04 Mar 2021 03:38 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..డేనియెల్‌ లారెన్స్ స్టంపౌట్

    ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు డేనియెల్‌ లారెన్స్‌ ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 70.1వ బంతిని ఆడబోయిన డేనియెల్‌ లారెన్స్‌ స్టంపౌట్‌ అయ్యాడు. కొద్దిగా టర్న్‌ అయిన బంతిని భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన డేనియెల్‌ కాస్త ముందుకు రాగా బంతి అందుకున్న కీపర్‌ రిషభ్‌ పంత్‌ వేగంగా స్టంపౌట్ చేశాడు.

  • 04 Mar 2021 03:15 PM (IST)

    ఏడో వికెట్‌ చేజార్చుకున్న ఇంగ్లాండ్‌

    ఇంగ్లాండ్‌ ఏడో వికెట్‌ చేజార్చుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ బెన్‌ఫోక్స్‌ ఔటయ్యాడు. అశ్విన్‌ విసిరిన 65.4వ బంతిని ఆడబోయిన అతడు స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు.

  • 04 Mar 2021 02:56 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఆరో వికెట్‌ను ఇంగ్లాండ్ కోల్పోయింది. అశ్విన్ చేతిలో  ఒలీ పోప్‌ ఔటయ్యాడు.  అశ్విన్‌ వేసిన 61.3వ బంతికి ఒలీపోప్‌ ఔటయ్యాడు. క్రీజులోంచి ముందుకు అడుగేసి ఆడబోయిన పోప్‌ బ్యాటుకు తగలిన బంతి అతడి ప్యాడ్లను తాకుతూ గాల్లోకి లేచింది. ఆ బంతిని అక్కడే ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.

  • 04 Mar 2021 02:15 PM (IST)

    టీ టైమ్ వరకు ఇంగ్లాండ్ స్కోర్ 144/5 (56)

    టీ బ్రేక్ సమయం వరకు ఇంగ్లాండ్ స్కోర్ 144/5. ఇంగ్లాండ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఓలీపోప్‌, లారెన్స్‌ నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే ఐదు వికెట్లు కోల్పోవడంతో జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో 53 ఓవర్లకు జట్టు స్కోరు 135/గా నమోదైంది.

  • 04 Mar 2021 01:40 PM (IST)

    బెన్ స్ట్రోక్ ఔట్…

    హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ స్ట్రోక్ ఔటయ్యాడు. ప్రమాదకరంగా మారుతున్న స్ట్రోక్ వికెట్‌ను  వాషింగ్టన్‌ సుందర్‌ ఇంటికి పంపించాడు. చక్కటి డెలివరి వేయడంతో వికెట్ పడింది. దీంతో ఆ జట్టు 121 పరుగుల వద్ద ఐదో వికెట్‌ నష్టపోయింది.  30 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్ట్రోక్ నిలకడగా ఆడుతూ స్కోరును 120 పరుగులకు తీసుకెళ్లాడు.

  • 04 Mar 2021 01:31 PM (IST)

    బెన్ స్ట్రోక్ హాఫ్ సెంచరీ

    బెన్ స్ట్రోక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు.. రెండు సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

  • 04 Mar 2021 01:29 PM (IST)

    ఇంగ్లాండ్‌ స్కోర్ 100 పరుగులు

    తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 100 పరుగులు దాటింది. అక్షర్‌పటేల్‌ వేసిన 40వ ఓవర్‌లో ఓలీపోప్‌(9) బౌండరీ సాధించడంతో ఆ జట్టు స్కోర్‌ 101/4కి చేరింది. మరోవైపు బెన్‌స్టోక్స్‌(40) నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  • 04 Mar 2021 12:35 PM (IST)

    భోజన విరామం తర్వాత మరో వికెట్..

    భోజన విరామం తర్వాత ఇంగ్లాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రెండో సెషన్‌ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ దెబ్బ తీశాడు. బెన్‌స్టోక్స్‌(28)తో కలిసి నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న బెయిర్‌ స్టో(28)ను పడేశాడు

  • 04 Mar 2021 11:41 AM (IST)

    భోజన విరామం…ఇంగ్లాండ్ 74/3 (25)

    భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్  74/3 (25) చేసింది. నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్.  మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్‌కు అక్షర్ రూపంలో భారీ దెబ్బ పడింది. 5 ఓవర్లకు 10 పరుగులతో నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లాండ్‌ జట్టును ఆరో ఓవర్‌లో అక్షర్‌ బ్రేక్ వేశాడు. అక్షర్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే సిబ్లీ(2) బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు.

    ఆ తర్వాత.. అక్షర్‌ పటేల్ రెండో వికెట్ కూడా‌ తీశాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌క్రాలే(9)ను ఔట్‌ చేశాడు. అతడు షాట్‌ ఆడగా మహ్మద్‌ సిరాజ్‌ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్‌ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక తొలి టెస్ట్‌లో టీమిండియాకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ను మహ్మద్‌ సిరాజ్‌ అడ్డుకట్ట వేశాడు.  హైదరాబాదీ సిరాజ్ వేసిన 13వ ఓవర్‌ తొలి బంతికి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్  ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

    క్రీజ్‌కి వచ్చిన స్టోక్స్ దూకుడు పెంచాడు. సిరాజ్ వేసిన 15వ ఓవర్‌లో బెన్‌స్టోక్స్‌(14) మూడు ఫోర్లు కొట్టాడు. అలాగే ఓ నోబాల్‌ పడడంతో ఆ ఓవర్‌లో మొత్తం 13 పరుగులొచ్చాయి. అయితే స్ట్రోక్స్ పరుగుల వరదకు అశ్విన్ బౌలింగ్‌కు రావడంతో నెమ్మదిగా పరగుల వేగం తగ్గింది.

  • 04 Mar 2021 11:25 AM (IST)

    మేడిన్ ఓవర్ వేసిన అశ్విన్

    21వ ఓవర్‌ను మేడిన్‌గా మార్చాడు అశ్విన్. దూకుడు మీదున్న స్ట్రోక్స్‌.. పరగుల వరదకు బ్రేక్ పడింది. స్కోర్ బోర్డ్ నెమ్మదించింది.

  • 04 Mar 2021 11:16 AM (IST)

    స్టోక్స్ బౌండరీ

    స్టోక్స్ దూకుడు పెంచాడు. 20 ఓవరల్ ఇషాంత్ బౌలింగ్‌‌లో బౌండరీ బాదాడు.

  • 04 Mar 2021 11:13 AM (IST)

    దూకుడు పెంచిన స్టోక్స్.. సిరాజ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు..

    సిరాజ్‌ వేసిన 15వ ఓవర్‌లో బెన్‌స్టోక్స్‌(14) మూడు ఫోర్లు కొట్టాడు. అలాగే ఓ నోబాల్‌ పడడంతో ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులొచ్చాయి.

  • 04 Mar 2021 10:47 AM (IST)

    ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్‌ ఔట్‌..

    ఇంగ్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 13వ ఓవర్‌ తొలి బంతికి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్  ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

  • 04 Mar 2021 10:23 AM (IST)

    లోకల్ బాయ్ ఖాతో మరో వికెట్.. ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది

    లోకల్ బాయ్ అక్షర్‌ పటేల్ ఖాతాలో రెండో వికెట్‌ పడింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌క్రాలే(9)ను ఔట్‌ చేశాడు. అతడు షాట్‌ ఆడగా మహ్మద్‌ సిరాజ్‌ చేతికి చిక్కి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఇంగ్లాండ్‌ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో, రూట్‌ ఉన్నారు.

  • 04 Mar 2021 10:02 AM (IST)

    నాలుగో టెస్టులో బోణీ కొట్టిన అక్షర్‌ పటేల్‌

    నాలుగో టెస్టులో ఐదవ ఓవర్‌లో రెండో బంతికి తొలి వికెట్ తీసిన అక్షర్‌ పటేల్‌. అక్షర్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే సిబ్లీ(2) బౌల్డ్‌ చేసి భారత్‌కు మంచి శుభారంభం అందించాడు.

  • 04 Mar 2021 09:58 AM (IST)

    ఇంగ్లాండ్‌ తుది జట్టు..

    ఇంగ్లాండ్‌ తుది జట్టు: డొమినిక్‌ సిబ్లీ, జాక్‌ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జోరూట్‌ (కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, ఓలిపోప్‌, బెన్‌ఫోక్స్‌, డానియల్‌ లారెన్స్‌, డొమినిక్‌ బెస్‌, జాక్‌లీచ్‌, జేమ్స్‌ అండర్సన్‌

  • 04 Mar 2021 09:57 AM (IST)

    టీమిండియా తుది జట్టు..

    టీమిండియా తుది జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, చెతేశ్వ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్య రహానె, రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌

  • 04 Mar 2021 09:42 AM (IST)

    బుమ్రా నాలుగో టెస్టుకు దూరం.. మహ్మద్‌ సిరాజ్ ఎంట్రీ

    వ్యక్తిగత కారణాలతో టీమిడియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా నాలుగో టెస్టుకు దూరమవడంతో మహ్మద్‌ సిరాజ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. డామ్‌ బెస్‌, లారెన్స్‌ తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు.

Published On - Mar 04,2021 5:06 PM

Follow us