టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే..
TS ICET 2021 Schedule: టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి..
TS ICET 2021 Schedule: టీఎస్ ఐసెట్ షెడ్యూల్ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఏప్రిల్ 3న ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. పరీక్ష ఫీజును రూ.650గా నిర్ణయించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు అప్లికేషన్లు తీసుకోనున్నట్లు పేర్కొంది. అలాగే ఆలస్య రుసుముతో అభ్యర్థులు జులై 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
జూన్ 30 వరకు రూ.250 అపరాధ రుసుము, జులై 15 వరకు రూ.500 అపరాధ రుసుము, జూలై 30 వరకు రూ.1000 అపరాధ రుసుముతో అప్లికేషన్లు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇక ఆగస్టులో మూడు సెషన్‌లలో ఐసెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. కేవలం అన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం విద్యాశాఖ ఐసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Read More:
సొంత పార్టీకి చెందిన మంత్రి ప్రకటన తెలియదంటావా..? ఏ అజ్జానంలో ఉన్నావు బండీ.. మంత్రి కేటీఆర్ ధ్వజం
మాకు మద్దతిస్తే కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం.. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల భేటీ
నాగార్జున సాగర్‌లో కాగుతున్న కాషాయం.. బండి సంజయ్‌కి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక