దేశ రక్షణలో స్టార్ మెడల్ అందుకున్న సైనికుడు.. బతుకు దెరువు కోసం 71 ఏళ్ల వయసులో ఆటో రిక్షాను లాగుతున్నాడు..!

. సైన్యంలో పనిచేసినంతకాలం ఉన్నత పతకాలను, గౌరవాలను అందుకున్న వ్యక్తి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో రిక్షా నడుపుతున్నాడు.

దేశ రక్షణలో స్టార్ మెడల్ అందుకున్న సైనికుడు..  బతుకు దెరువు కోసం 71 ఏళ్ల వయసులో ఆటో రిక్షాను లాగుతున్నాడు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 03, 2021 | 7:19 PM

Retired Soldier : చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ.. ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్నారు జవాన్లు. ఎన్నో కష్టాలకోర్చి దేశ సరిహద్దులో సైనికులు పహారా కాయడం వల్లనే పౌరులంతా భద్రంగా జీవిస్తున్నారన్నారు. అటువంటి సైనికులు, వారి కుటుంబాలు రెక్కాడితే గానీ, డొక్కాడని పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు. సైన్యంలో పనిచేసినంతకాలం ఉన్నత పతకాలను, గౌరవాలను అందుకున్న వ్యక్తి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో రిక్షా నడుపుతున్నాడు. తాజాగా ఈ ఘటన ఒకటి హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూసింది.

భారత-చైనా యుద్ధంలో స్టార్ మెడల్ అవార్డు గ్రహీత అయిన మాజీ సైనికుడు, ఇప్పుడు జీవించడానికి హైదరాబాద్‌లో ఆటోరిక్షాను నడుపుతున్నాడు. పాతబస్తీకి చెందిన మాజీ ఆర్మీ సిబ్బంది షేక్ అబ్దుల్ కరీం స్టార్ మెడల్ అందుకుకున్నాడు. భారత-చైనా యుద్ధానికి ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం ప్రత్యేక అవార్డు అందించింది. సైన్యంలో ఉన్నతకాలం దేశభక్తికే అంకితమయ్యాడు. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాక, కుటుంబపోషణనే కష్టంగా మారింది. దీంతో వచ్చే ఫించన్ డబ్బులు సరిపోక సంసార సాగరాన్ని ఈదుతున్నాడు. ఆర్థిక సాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

అబ్దుల్ కరీం తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేశారు. బ్రిటిష్ సైన్యం తరువాత భారత సైన్యంలో బాధ్యతలు నిర్వహించారు. తండ్రి మరణం తరువాత కరీంను భారత సైన్యంలో చేర్చుకున్నారు. 1964 లో భారత సైన్యంలో చేరిన కరీం భారతదేశం తరుపున చైనా యుద్ధంలో పాల్గొన్నారు. లాహౌల్ ప్రాంతంలో విధులు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆయనను గుర్తించిన భారత ప్రభుత్వం స్టార్ మెడల్ ప్రధానం చేసింది. అంతేకాదు,1971లో ప్రత్యేక అవార్డు గ్రహీతగా కూడా ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.

అయితే, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మిగులు ఆర్మీ సిబ్బంది ఉన్నందున, వారిలో చాలా మందిని పోస్టింగ్స్ నుండి తొలగించారు. ఇలా తొలగించిన వారిలో ఒకరు అబ్దుల్ కరీం. సైన్యంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ భూమి కోసం దరఖాస్తు చేసుకుంటే.. గొల్లపల్లి గ్రామంలో ఐదు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని దాదాపు 20 సంవత్సరాల తరువాత వెళ్లి చూస్తూ తనకు ఇచ్చిన ఐదు ఎకరాల భూమి ఏడుగురు గ్రామస్తులు కబ్జా చేరని కరీం తెలిపారు. దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన తరువాత.. అదే సర్వే నంబర్ క్రింద మరో ఐదు ఎకరాలు ఇచ్చింది. కాని అసలు భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఇది దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. ఇప్పటి వరకు భూమి వివరాల పత్రంగానీ, పట్టా పాసుబుక్‌ కానీ ఇవ్వలేదని కరీం అవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, సైన్యం నుండి తొలగించబడిన తరువాత, అతను చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. తనకు ఇల్లు కూడా లేదని, ప్రస్తుతం, 71 సంవత్సరాల వయసులో, తన కుటుంబాన్ని పోషించడానికి ఆటో రిక్షాలను నడుపుతున్నానని చెప్పారు. “నేను ఈ దేశానికి ఆర్మీ సిబ్బందిగా తొమ్మిది సంవత్సరాలు నా సేవలను అందించాను, కానీ ఇప్పుడు 71 సంవత్సరాల వయస్సులో ఆటో రిక్షాను నడుపుతున్నాను. నా కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంది. నా కుటుంబాన్ని చూసుకోవటానికి నా సొంత ఇల్లు కూడా లేదని అవేదన వ్యక్తం చేశారు కరీం. నిరాశ్రయులైన మాజీ సైనికులకు పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మంచి సేవా పతకం సాధించినప్పటికీ, నాకు ఎలాంటి పెన్షన్ గానీ, ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం గానీ రాలేదన్నారు. సహాయం అవసరమైన మాజీ సైనికులకు ఆర్థికంగా సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు కరీం.

Read Also… కోవిడ్ 19 పాజిటివ్ కి గురై ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్ధి మృతి, మరో 9 మంది విద్యార్థులకు పాజిటివ్