AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు నెలల క్రితం పూడ్చిన మృతదేహం.. అల్లుడి అతితో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు ట్విస్ట్ ఇదే.!

తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ కూతురు జిల్లా ఎస్సీని ఆశ్రయించింది. కూతురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..

రెండు నెలల క్రితం పూడ్చిన మృతదేహం.. అల్లుడి అతితో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు ట్విస్ట్ ఇదే.!
Ravi Kiran
|

Updated on: Mar 03, 2021 | 6:41 PM

Share

తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ కూతురు జిల్లా ఎస్సీని ఆశ్రయించింది. కూతురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..రెండు నెలల క్రితం చనిపోయిన బాధితురాలి తల్లి మృతదేహనికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నజీమా బేగం కొద్దికాలంగా కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లోని తన కూతురు వద్దే ఉంటోంది. గత డిసెంబర్‌లో నజీమా హఠాన్మరణం చెందింది. గుండెపోటుతో చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. అత్త చనిపోయి రెండు నెలలు తిరగకుండానే ఆమె ఆస్తులపై అల్లుడి కన్ను పడింది. ఆస్తులు అమ్మేద్దామంటూ ఒత్తిడి చేయడంతో కూతురికి అనుమానమొచ్చింది. తల్లి ఒంటిపై గాయాలు కూడా గుర్తుకొచ్చి తన తల్లిని హత్య చేశారంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది.

తన తల్లిని భర్త, మేనమామ కలిసి హతమార్చారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 75 రోజుల తర్వాత నజీమా మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసు విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

గురకపెట్టి నిద్రపోయిన కాపలా కుక్క.. గన్ పెట్టి షాపును దోచుకున్న దొంగ.. మధ్యలో అదిరిపోయే ట్విస్ట్..!

లోదుస్తులను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్.. నెట్టింట నవ్వులు పువ్వులు..

పవన్ కళ్యాణ్‌కు నాలుగో భార్యగా ఉంటాను.. నెటిజన్ ప్రశ్నకు ఆషూ ఆన్సర్.. వైరల్ ట్వీట్.!

Bigg Boss Season 5: బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!