UPSC Prelims Notification: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించిన యూపీఎస్సీ

భారతదేశంలో సర్వోన్నత సర్వీసులైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 కోసం...

UPSC Prelims Notification: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించిన యూపీఎస్సీ
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2021 | 3:37 PM

UPSC Civil Services Prelims Exam 2021:  భారతదేశంలో సర్వోన్నత సర్వీసులైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్ష 2021 కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 24 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. యూపీఎస్సీ  సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2021 జూన్ 27 న నిర్వహించబడుతుంది.

ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చునని.. ఈ అధికారిక వెబ్‌సైట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. అంతేకాదు సీఎస్ఈ-2021, ఐఎఫ్‌వోఎస్ఈ-2021 పరీక్షలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని తెలిపింది.

ఆసక్తి గల అభ్యర్థులు UPSC application websiteలో లాగిన్ అయ్యి పరీక్షకు అప్లై చేసుకోవచ్చు..

ప్రతి ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్‌తో పాటు సీఎస్ఈ, ఐఎఫ్ఓలకు పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్, ఆపై ఇంట్వ్యూలు నిర్వహించి ఆయా పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేస్తుందని తెలిసిందే. కాగా, జూన్ 27వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

గతేడాది చివరి ప్రయత్నం అయి ఉండి కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరుకాని గరిష్ట వయసుమించిన వారికి మరో అవకాశం కల్పించడం లేదు. కేవలం నిర్ణీత వయసులో ఉన్న వారికి మాత్రమే ఈ ఏడాది మరో ప్రయత్నం చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షను క్లియర్ చేసిన అభ్యర్థులు మాత్రమే సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షకు అర్హులు. అనంతరం ర్యాంకు సాధించిన వారిని ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read:

గ్రాండ్ గా గుర్రం బర్త్ డే వేడుకలు.. పండగ జరిపిన యజమాని.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలు..

: ఈ టీవీ ధర రూ. 2.91 కోట్లు… ఇందులో అంతలా ఏముందనేగా మీ సందేహం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే