- Telugu News Photo Gallery Technology photos Worlds first folding micro led tv worth nearly 3 crore rupees
Worlds First Folding Micro LED TV: ఈ టీవీ ధర రూ. 2.91 కోట్లు… ఇందులో అంతలా ఏముందనేగా మీ సందేహం..
World's First 165-inch folding MicroLED TV: మనకు తెలిసిన టీవీల్లో అత్యధిక ధర మహా అయితే ఒక రూ.మూడు లక్షలు ఉంటుంది. మరి రూ.3 కోట్ల విలువైన టీవీ కూడా ఉందని మీకు తెలుసా.? ఆస్ట్రీయాకు చెందిన 'సీ సీడ్' అనే కంపెనీ ఈ టీవీని రూపొంచింది..
Updated on: Mar 04, 2021 | 2:39 PM

మారుతోన్న కాలానికి అనుగుణంగా టీవీల తయారీలోనూ మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడున్న ఫోర్టబుల్ టీవీల స్థానంలో ఇప్పుడు నాజుగ్గా ఉన్న ఎల్‌ఈడీ, ఎల్‌సీడీలు వచ్చాయి.

ఇక అన్ని గ్యాడ్జెట్లు స్మార్ట్‌గా మారుతోన్న వేళ టీవీలు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు అన్ని కంపెనీలు స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆస్ట్రీయాకు చెందిన 'సీ సీడ్' అనే కంపెనీ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఫోల్డబుల్ (మడతపెట్టే) టీవీని ప్రపంచానికి పరిచయం చేసింది.

165 అంగుళాల భారీ స్క్రీన్‌తో ఉండే ఈ ఫోల్డబుల్ టీవీ ఫ్లోర్ లోపలి నుంచి బయటు వచ్చి పెద్ద స్క్రీన్‌లా పరుచుకోవడం విశేషం. అంటే మాములు సమయంలో అసలు అక్కడ టీవీ ఉందన్న విషయం కూడా తెలియదన్నమాట.

ఓఎల్‌ఈడీకి అడ్వాన్స్ వెర్షన్ అయిన మైక్రో ఎల్‌ఈడీని ఇందులో ఉపయోగించారు. దీంతో టీవీ మరింత స్పష్టతతో టీవీని చూసే అవకాశం లభిస్తుంది.

ఇక ఈ టీవీ ధర అక్షరాలు రూ. 2.91 కోట్లు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు మొదలు పెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.




