Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
దిత్వా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై .. శుక్రవారం వాతావరణ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది.

దిత్వా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై .. శుక్రవారం వాతావరణ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడిందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శుక్రవారం, శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
శనివారం ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:-
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బంగాళాఖాతంలో తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే.. శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
