AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam : దీపకు ఘోర అవమానం.. అమ్మ , నాన్నా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అంటూ చాయిస్ పిల్లలకే ఇచ్చేసింది

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 977 వ ఎపిసోడ్ కు ఎంటర్ అయ్యింది. నేను మారను నేను చూసింది.. తెలుసుకున్నది సత్యం అని కార్తీక్ కుటుంబ సభ్యులతో...

Karthika Deepam : దీపకు ఘోర అవమానం.. అమ్మ , నాన్నా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అంటూ చాయిస్ పిల్లలకే ఇచ్చేసింది
Surya Kala
|

Updated on: Mar 04, 2021 | 10:32 AM

Share

Karthika Deepam : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 977 వ ఎపిసోడ్ కు ఎంటర్ అయ్యింది. నేను మారను నేను చూసింది.. తెలుసుకున్నది సత్యం అని కార్తీక్ కుటుంబ సభ్యులతో తెగేసి చెబుతాడు. ఇక నేను మారడం కోసం ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా అనవసరం అని ఖరాకండిగా చెప్పేస్తాడు కార్తీక్. దీంతో దీప మంచిది.. నేను నా వ్యక్తిత్వాన్ని అంగటిలో సరుకులా అమ్మలేను నేను.. అమ్మని నేను.. అమ్మకానికి పనికి రాని.. వస్తువును కాను.. అయిపోయింది అత్తయ్యా.. మనకు దొరికిన చిరు దీపం కూడా కొడిగంటుకుపోయింది.. నమ్మరు.. మారరు.. అర్థం చేసుకోరు.. అక్కర్లేదు.. నేను అక్కర్లేదు.. నా పిల్లలు అక్కర్లేదు.. వాళ్ల భవిష్యత్ అవసరం లేదు.. పదేళ్ల తపస్సుకు ఒక ముగింపు దొరికింది అని మీరు అనుకున్నారు.. ఇది కూడా కల్పితమేనని ఆయన అనుకున్నారు. ఇంకేం చెప్పాలని దీప కన్నీరు పెట్టుకుంటుంది.

దీప ని కార్తీక్ ఇంకేం చెప్పొద్దు అంటూ మరింతగా అవమానిస్తాడు.. ఆ విహారీ ఎటువంటి వాడైనా కానీ నీ పవిత్రతను రుజువు చేసుకోవడానికి అతడి కాపురాన్ని కూడా బజారులో పెట్టిన దిగజారిపోయిన నెరజానవే నువ్వు.. నిన్ను ఎలా నమ్ముతాను అంటాడు దీంతో దీప బాధగా కార్తీక్ ను చూస్తుంది.. అప్పుడు సౌందర్య కోపంతో కార్తీక్ అని కొట్టబోతుంటే.. దీప అడ్డుపడి ఆపుతుంది.  నేను బయటదానిని నావల్ల ఎదిగిన కొడుకుని కొడితే మాత్రం కోడలి పవిత్రత రుజువు అవుతుందా ఇక నా బతుకు ఇంతే.. ఎప్పటికీ ఇంతే అంటూ వేదన వ్యక్తం చేస్తుంది.

ఇంతలోశౌర్య, హిమ పైనుంచి కిందకి దిగి వస్తారు.. వాళ్ళని దగ్గరకు తీసుకున్న దీప మీకు నేను మనం అంతా కలిసి ఉంటామని మాట ఇచ్చాను కానీ ఎం చేయలేకపోయాను.. ఇక మీకు అమ్మ.. నాన్న ఎవరో ఒకరే మిగిలారు.. ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అమ్మ కావాలంటే నా దగ్గరకు రండి.. నాన్న కావాలంటే ఇక్కడే ఉండదని అని ఛాయిస్ పిల్లలకే వదిలేస్తుంది. పిల్లలు ఏడుస్తూ దీపని హత్తుకుంటారు.

దీపని వెళ్ళవద్దు అని సౌందర్య వారిస్తుంటే తప్పదు అత్తయ్యా అంటూ గడప దాటడానికి వస్తుంది. అప్పుడు పిల్లల్ని కార్తీక్ దగ్గరకు తీస్కుని నాన్నా చెడ్డవాడు కాడని మీరు నమ్మండి.. ఎక్కడైనా అని అంటుంటే. దీప పిల్లల్ని తీసుకుని గడప దాటుతుంది. ఆ సమయంలో తనకు కార్తీక్ కు పెళ్లి దగ్గర నుంచి వారిద్దరూ గడిపిన గతం తాలూకూ అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది.  మరోవైపు మోనిత కార్తీక్ ఇంట్లో ఎం జరిగిందా అని ఆలోచిస్తూ. కార్తీక్ కు ఫోన్ చేస్తుంది.. కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు.

ఆటోలోంచి దీప తన పిల్లలను తీసుకుని ఇంట్లోకి నడుస్తుంటే.. శౌర్య వెనక్కి వచ్చి వారణాసి.. నన్ను నాన్నదగ్గరకి తీసుకుని వేళ్ళు అని అడుగుతుంది.. అప్పుడు హిమ లోపలికి పిలుస్తుంది. ‘నేను రాను.. నాకు నాన్న కావాలి.. ’ అని శౌర్య ఏడుస్తుంది. అప్పుడు హిమ నాన్నకు అమ్మ వద్దు మనం వద్దు.. మనం వస్తుంటే కనీసం ఉండండి అని అనలేదు.. ఎందుకు వెళ్తాను అంటున్నావు అంటుంది.

అప్పుడు శౌర్య అమ్మదగ్గరికి వచ్చి నేను నాన్నలేకుండా ఎలా ఉండాలి.. నాన్నా చాలా మంచివాడు నువ్వు అందరం కలిసి పోతామని చెప్పావు కదా పదేళ్ల నుంచి ఈరోజు కోసమే ఎదురు చూశాను ఇక ఎప్పటికీ రాదు అని నాకు అర్ధమైపోయింది నాన్న లేకుండా ఎలా ఉండాలి అని అమ్మని ప్రశ్నిస్తుంది.. మరి కూతురుకి దీప సమాధానం ఏమిటి..? ఇక నుంచి కార్తీక్ ను నమ్మించే ప్రయత్నం విరమించుకుని తాను జీవితంలో ఎదగడానికి ప్రయత్నిస్తుందా ఏ నిర్ణయం తీసుకుంటుంది నెక్ట్ ఎపిసోడ్ లో చూడాలి.

Also Read:

రాజకీయ నేపథ్యం హైలైట్‌‌‌‌‌‌గా దళపతి నెక్స్ట్ సినిమా.. దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్…

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్.. సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో టీమిండియా..