Actress : నా జీవితంలో ఆ హీరోకు తల్లిగా నటించను.. ఇదే నా ప్రామీస్.. హీరోయిన్ కామెంట్స్..
సాధారణంగా హీరోయిన్ గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ వయసుకు మించిన పాత్రలు పోషిస్తుంటారు. తమకంటే వయసులో పెద్ద అయిన హీరోలకు తల్లిగా, వదినగా నటిస్తుంటారు.

వెండితెరపై హీరోయిన్స్ కంటే ఎక్కువగా సహాయ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న తారల గురించి అంతగా చెప్పక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలతో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం చాలా ఫేమస్. తెరపై పాత్రలను ధైర్యంగా పోషించడంలో పేరుగాంచిన నటి షెఫాలీ షా. హిందీ సినీప్రియులకు ఈ హీరోయిన్ సుపరిచితమే. హిందీలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెఫాలీ.. తన జీవితంలో ఎప్పుడూ అక్షయ్ కుమార్‌కు తెరపై తల్లిగా నటించనని అన్నారు.
షెఫాలీ మాట్లాడుతూ.. “నిజాయితీగా చెప్పాలంటే నేను అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం ఆనందించాను. నేను బహుశా ఒక దర్శకుడు లేదా ఒక నటుడితో పనిచేశాను, వారు చాలా అభ్యంతరకరంగా ఉన్నారు. నటులు కేవలం నటులు మాత్రమే కాదు, వారు సహకారులు అని భావించే దర్శకులతో నేను పనిచేశాను” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..
అలాగే 2005లో విడుదలైన వఖ్త్ : ద రేస్ ఎగైనెస్ట్ టైమ్ చిత్రంలో బాలీడ్ స్టార్ అక్షయ్ కుమార్ తల్లిగా కనిపించింది.కానీ అక్షయ్ కంటే షెఫాలీ నాలుగేళ్లు చిన్నది. ఇదే విషయం పై షెఫాలీ మాట్లాడుతూ.. నా జీవితంలో ఇంకెప్పుడూ అక్షయ్ కుమార్ తల్లిగా నటించనని నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి.

Shefali, Akshay Kumar
ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..




