AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Pain Tips: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..

ప్రస్తుతం మెడ నొప్పి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టెస్తుంది. ఇక దీని ప్రభావంతో చాలా మంది

Neck Pain Tips: మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2021 | 9:09 PM

Share

ప్రస్తుతం మెడ నొప్పి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టెస్తుంది. ఇక దీని ప్రభావంతో చాలా మంది కళ్ళజోడులు ధరిస్తుంటారు. ఇక కరోనా ప్రభావంతో గతేడాది మొత్తం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కేటాయించాయి. ఇప్పటికే ఈ కొన్ని కంపెనీలు దీనిని కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మేడనొప్పి. ఇంట్లో సరిగ్గా కూర్చునేందుకు వీలు లేకపోవడం… ఎక్కువగా సేపు సిస్టం చూడడం వలన ఈ సమస్య మరింతగా వేదిస్తోంది. ఇక సమస్యను తగ్గించుకోవడానికి చాలా మది ట్యాబ్లెట్స్ వేసుకోవడం, బాబ్స్ రాయడం, అయింట్ మెంట్స్ వాడడం చేస్తుంటారు. అయినా ఆ సమస్య నుంచి పరిష్కారం మాతర్ం లభించదు. దీంతో చేస్తున్న పనిపై శ్రద్ధ వహించాలేకపోతుంటారు. అయితే కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో అయితే ఈ సమస్యను నుంచి సులభంగా బయటపడోచ్చట. మరీ అవెంటె తెలుసుకుందామా.

మనం కూర్చునే ప్రదేశం, కూర్చునే విధానం సరిగ్గా ఉండకపోతే… ఈ మెడ, భుజాల నొప్పి మొదలవుతుంది. ఆరోగ్య నిపుణులు దీనికి మూడు మార్గాలు చెబుతున్నారు. పని మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. బెడ్‌పైకి ల్యాప్‌టాప్ తీసుకెళ్లకూడదు. ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటే… ఇలాంటి నొప్పులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. కానీ… కూర్చొనే ల్యాప్‌టాప్, సిస్టం లాంటి వాటిలో పని చేయాల్సి వస్తే మార్చుకోవడం మంచింది. ముఖ్యంగా మీ కీబోర్డు… మీ మోచేతుల కంటే కిందకు ఉండేలా చేసుకోవాలి. మీరు కూర్చునే విధానంలో మీ మోచేతుల కంటే… కీబోర్డు ఎత్తుగా ఉంటే… మరీ మీ కుర్చీ హైట్ పెంచుకొని కూర్చోవాలి. లేదా… కీబోర్డ్ ఎత్తు తగ్గించాలి. ఏం చేసైనా సరే… మోచేతులే ఎత్తుగా ఉండాలి. లేదంటే భుజం నొప్పి భరించాల్సి వస్తుంది. రెగ్యులర్‌గా యోగా, ఎక్సర్‌సైజ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇవి కండరాల్లో కదలికలు పెంచి… రక్త ప్రసరణ బాగా అయ్యేలా చేసి… అడ్డమైన నొప్పుల నుంచి కాపాడతాయి. రోజూ కనీసం గంటైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలంటున్నారు. ఇందుకోసం మెట్లు ఎక్కి దిగడం, గార్డెన్‌లో మొక్కల పని చెయ్యడం చేస్తుండాలి. ఇలా చేయడం వలన  బాడీలో కొవ్వు కరిగిపోతుంది. పండ్లు, జ్యూస్, డ్రాఫ్రూట్స్, పప్పులు, గింజల వంటివి తినమని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తీసుకోవడం ఉత్తమం.

Also Read:

హాలీడే ట్రిప్ కోసం కేరళ వెళ్తున్నారా ? అయితే మీకోసం కేరళలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలు..