Mysterious Temple: సైన్స్‌కు అందని అద్భుతం.. 7వేల ఏళ్ల చరిత్ర గల ఆలయం.. నందీశ్వరుడు నోటి నుంచి నిరంతరం జలధారలు

అన్ని శివాలయాల్లో ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా నందీశ్వరుడు ఉన్నాడు.. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏమిటో చూద్దాం..!

Mysterious Temple: సైన్స్‌కు అందని అద్భుతం.. 7వేల ఏళ్ల చరిత్ర గల ఆలయం.. నందీశ్వరుడు నోటి నుంచి నిరంతరం జలధారలు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 06, 2021 | 7:49 AM

7000 Year Older Mysterious Temples : త్రిమూర్తుల్లో ఒకరు శివయ్య.. నాగుపాములే ఆభరణాలుగా, నందీశ్వరుడు వాహనంగా లోకాన్ని రక్షించే లోకేశ్వరుడు.. జలం, విభూతితో అభిషేకించినా కొరికిన క్రొర్కెలు తీర్చే భోళాశంకరుడు. ఈ శివయ్య వాహనం నందీశ్వరుడు ప్రతి శివాలయంలోనూ ఉంటుంది. భగవంతుడికి భక్తుడి మధ్య అనుసంధానంగా ఉంటూ.. భక్తుల కోర్కెట్లను శివయ్య చెవిలోకి చేరవేస్తుంది. అందుకనే శివాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ముందుగా నందిని దర్శనం చేసుకుంటాము. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు.  అయితే అన్ని శివాలయాల్లో ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా నందీశ్వరుడు ఉన్నాడు.. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతినిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏమిటో చూద్దాం..!
 
పరమేశ్వరుడి పురాతన ఆలయం ఒకటి తవ్వకాల్లో బయల్పడింది. ఈ నాటికి చెక్కుచెదరక ఉన్న ఆ ఆలయం నేడు భక్తుల రాకతో సందడిగా మారింది. ఈ ఆలయానికి శ్రీ దక్షిణా ముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అని పేరు. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో దాదాపు 7 వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది. భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి. బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నంది తీర్ధ, నందీశ్వర తీర్ధ, బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఉంటుంది. ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది. ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది.
 
ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన ఆలయాల్లో ఇది ఒకటి. 1997వ సంవత్సరంలో ఓ నిర్మాణం కోసం మట్టిదిబ్బ తవ్వినప్పుడు కార్మికులు ఒక ఆలయం యొక్క గోపురాన్ని కనుగొన్నారు. వారు లోతుగా తవ్వి, మట్టిదిబ్బ మీద పెద్ద ఆలయం ఉన్నట్లు కనుగొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం గ్రానైట్ స్టెప్స్ కలిగి ఉండి చుట్టూ స్తంభాల మంటపాలతో అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలో నీటి కొలను కూడా కనుగొన్నారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా రాతి నంది విగ్రహం నోటి నుండి సన్నని ధారగా వస్తున్న నటీని గుర్తించారు ఆర్కియాలజిస్టులు. ఈ ఆలయం వయస్సు కనీసం 400 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మరికొన్ని నివేదికలు ఆలయం సుమారు 7000 సంవత్సరాల నాటిదని చెబతున్నాయి.
 
కాబట్టి ఈ ఆలయాన్ని మర్మంగా చేస్తుంది? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నంది యొక్క నోటిని శుభ్రపరచగా వారు నంది నోటి నుంచి నిరంతర నీటి ప్రవాహం వస్తుందని తెలుసుకున్నారు. ఇది వృషభవతి నది యొక్క ప్రధాన వనరు లేదా జన్మస్థలం అని అంటారు. ఆలయానికి పేరు ‘ దక్షిణముకా నంద్ ‘ అంటే ‘దక్షిణ ముఖంగా ఉన్న నంది ‘. కన్నడలో ‘ తీర్థ’ అని పిలువబడే పవిత్ర జలంగా పరిగణించబడే నంది నోటి నుండి నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహం ఉంది. నంది నోటి నుండి నీరు శివలింగంపైకి వచ్చి ఆలయం మధ్యలో ఒక మెట్ల తొట్టెలోకి ప్రవహిస్తుంది, దీనిని కన్నడలోని ‘ కళ్యాణి ‘ – టెంపుల్ ట్యాంక్ అని పిలుస్తారు . ‘క్షేత్రం’ అంటే కన్నడలో ‘స్థలం’ మరియు చారిత్రక లేదా మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం అని అర్థం. పైన పేర్కొన్న అన్ని అంశాల కలయికతో ఆలయానికి ఆ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
 
ఈవిధంగా అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తూ పైనుండే నంది నుండి శివలింగం పైన నీరు పడటానికి పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి మిస్టరీగానే ఉండగా భక్తులు మాత్రం ఇదంతా ఆ శివయ్య లీలే అంటూ భారీ సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.