Karthika Deepam Serial : నీ కళ్ళకు అనుమానం అనే ఇనుపతెరలు కట్టుకున్నావని అన్నని నిలదీసిన ఆదిత్య.. ఆనందరావు హార్ట్ ఎటాక్..

శౌర్య అమ్మని నిలదీస్తుంది. నాన్న హిమకి అమ్మ మరణించింది అని చెప్పాడు. నువ్వు నాన్న ఎక్కడ అని అడిగితె దుబాయ్ లో ఉన్నాడు అని నమ్మించావు. ఇద్దరూ అబద్దాలు చెప్పారు. నాన్నా మంచివాడే కాదమ్మా.. మా కోసం నువ్వు అక్కడికి రావు. నాన్న మమ్మల్ని...

Karthika Deepam Serial : నీ కళ్ళకు అనుమానం అనే ఇనుపతెరలు కట్టుకున్నావని అన్నని నిలదీసిన ఆదిత్య.. ఆనందరావు హార్ట్ ఎటాక్..
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2021 | 10:31 AM

Karthika Deepam Serialతెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 978 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దీప తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని శాశ్వతంగా తన ఇంటికి వచ్చేస్తుంది. ఈ సమయంలో శౌర్య అమ్మని నిలదీస్తుంది. నాన్న హిమకి అమ్మ మరణించింది అని చెప్పాడు. నువ్వు నాన్న ఎక్కడ అని అడిగితె దుబాయ్ లో ఉన్నాడు అని నమ్మించావు. ఇద్దరూ అబద్దాలు చెప్పారు. నాన్నా మంచివాడే కాదమ్మా.. మా కోసం నువ్వు అక్కడికి రావు. నాన్న మమ్మల్ని అందుకే రమ్మనమని అడగడు.. మరి మేము నాన్న లేకుండా ఎలా ఉండాలని అని దీపని నిలదీస్తుంది శౌర్య. అప్పుడు హిమ స్పందిస్తూ.. నాన్న మనల్ని రమ్మన్న రోజే వెళ్దాం అంటుంది. ఇంకా నీకు నమ్మకం ఉందా..! మనం వస్తున్నప్పుడు మనల్ని నాన్న ఆపలేదు అంది శౌర్య గుర్తు చేసింది. అందుకే అమ్మతోనే ఉందాం..’ అంటుంది హిమ. ‘నాన్న ఎప్పటికీ రాడు హిమా..’ అంటుంది శౌర్య . దీంతో నాన్న నాకు కావాలి .. నాన్నంటే నాకు చాలా ఇష్టం అని హిమ ఏడుస్తుంది. దీంతో దీప స్పందించి మీకు మీ నాన్న కావాలి.. నాకు మీ నాన్నకావాలి.. అయితే మీ నాన్నకు నేను అక్కర్లేదు.. మీరు వెళ్తే వద్దని అనరు. మిమ్మల్ని ప్రేమగానే పెంచుకుంటారు.. అన్న దీప.. వారణాసి వాళ్లని ఆ ఇంటి దగ్గర దింపేసిరా.. అంటుంది.

అపుడు శౌర్య అమ్మా నువ్వు అని అడుగుతుంది. ఏమౌతాను ఈ పదేళ్ల నుంచి ఎలా బతుకుతున్నానో అలాగే బతికేస్తా.. మిమ్మల్ని పదేళ్ల క్రితం కడుపున మోస్తూ గడప డేటా.. ఉండడానికి ఇల్లు లేక దేవుడి గుడిలో , ఏ బడి పంచనో ఉంటూ కాలం గడిపేశా. ఏమయ్యాను ఒంటరినయ్యాను.. అనాథనయ్యాను. దిక్కులేని పక్షినయ్యాను. పదేళ్ల బతకలేదా? మిమ్మల్ని బతికించుకోలేదా..? ఇక్కడూ ఎక్కడో బతికే ఉంటాను.. ఇలాగే మళ్లీ మొక్కల మధ్య బతికేస్తూ ఉంటాను.. పిచ్చి మొక్కలే బతికేస్తున్నాయి నేను బతకలేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అప్పుడు హిమ , శౌర్య లతో దీప మీ భవిష్యత్ ను నాశనం చేసే శక్తి లేదు. మీరు అక్కడుంటేనే మీకు గొప్పబతుకు, మంచి చదువు నాతో ఉంటె మీకు ఏముంది. ఒకొక్కసారి తినడానికి బియ్యం కూడా ఉండదు. మీరు మీ నాన్నదగ్గరకు వెళ్ళండి నేను.. చావకుండా బతక్కుండా బతికేస్తాను. ఇంతకాలం కలుస్తామనే నమ్మకం బతికించింది. ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా చచ్చిపోయిందిని అంటుంది దీప. వారణాసిలో దీప వీళ్ళిద్దరినీ వాళ్ళ నాన్నదగ్గరకు తీసుకుని వెళ్లి దింపేసిరా అని అంటుంది. వేటననే వారణాసి కలుగ జేసుకుని శౌర్యమ్మ నన్ను తిట్టినా సరే.. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఇన్నోరోజులు నిన్ను అమ్మ ఎలా పెంచిందో మరచిపోయావా.. ఇప్పుడు మీ నాన్న కారులో తిప్పి.. ఖరీదైన భోజనం పెట్టినంత మాత్రాన్న అమ్మని వదిలేస్తావా? రండమ్మా తీసుకుని వెళ్తాను.. ఆటో ఎక్కండి.. అమ్మ ఎలా పోతే మీకెందుకు? మీకు మీ నాన్నే ముఖ్యం.. ఆ దొరకి మీ అమ్మ అక్కర్లేదు.. మీరంతా కలిసే ఉండండమ్మా.. రండి.. వదిలేసి వస్తాను అని అంటాడు.

దీంతో పిల్లలు ఇద్దరూ ఏడుస్తూ.. దీపని పట్టుకుని సారీ అమ్మా.. మాకు ఇద్దరూ కావాలి.. ఇద్దరిలో ఒక్కరే కావాలంటే నువ్వే కావాలి అంటూ ఏడుస్తూ హత్తుకుంటారు

ఇక సౌందర్య ఇంట్లో అందరూ దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. అదే సమయంలో కార్తీక్ మీద మీద నుంచి కిందకు దిగి వచ్చి వాళ్ళకి చూసి తనకు అందరు కల్సి ఎదో అన్యాయం చేస్తున్నారు అన్నట్లు మాట్లాడతాడు. ‘చూడండీ.. దీర్ఘంగా ఆలోచించాల్సింది.. భారంగా వెళ్లదియ్యాల్సింది.. చివరికి ఏం మిగిలిందని ఏడాల్సింది నేను.. మీరు ఎవ్వరూ కాదు.. మీకే మీరంతా బాగానే ఉన్నారు.. మీకేం కష్టం వచ్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డని నాకు కాకుండా చేసి దూరం చేసి తీసుకుని వెళ్లిపోయిందే పుణ్యాత్మురాలు.. మర బొమ్మలా గుండెలాని మనిషిలా నిలబడింది నేను.. నేను ఎన్నో గుండెల్ని బాగుచేవాను.. నా గుండెకైన గాయానికి ఏ మందులు వేసుకోవాలో తెలియట్లేదు.. జాలిపడాల్సిన విషయం ఏంటంటే.. నా మీద మీ ఎవ్వరికీ జాలి లేదు.. పాపం నేను.. తిలాపాపం తలాపిడికెడు అంటారు.. ఆ పాపంలో మీ అందరికీ భాగం ఉందని నిందిస్తుంటే.. ఆదిత్య .. ఆ మాటలకు అడ్డు పడతాడు. దింతో అక్కడ ఉన్న అందరూ షాక్ తింటారు. పాపంలో మాకు ఎం సంబంధం లేదు. ఆ పాపంలో మాకు ఎందుకు భాగాలూ పంచుతున్నాం.. మేము ఏమి నేరం చేశాం.. వీళ్లేం చేశారు.. పిల్లలు ఏం చేశారు..చేసుకున్నదంతా నువ్వు.. చేసిందంతా నువ్వు అని ఆదిత్య అన్న ను నిలదీస్తాడు. అప్పుడు కార్తీక్ అసలు ఏం మాట్లాడుతున్నావ్ రా? అనాథ బిడ్డ అని చెబితే అపురూపంగా పెంచుకున్నాను.. కాదని తెలిసినా పెంచిన ప్రేమ అనువంత కూడా తగ్గలేదు.. ఆ రౌడీని నేను పెంచలేదు.. రెండురోజులు నేను నీతో ఉంటాను నాన్నా.. అంటే.. మనసు చెలించిపోయి ఇంటికి తీసుకొచ్చాను.. ప్రేమగా చూసుకున్నాను.. దాని ప్రేమకు మురిసిపోయాను.. దాని దారిలోనే ప్రయాణం చేశాను.. అందుకు వాళ్లు ఏం చేశారు? నిర్థాక్షణ్యంగా నన్ను కాదని దాని వెంటనే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తాడు కార్తీక్…

అప్పుడు ఆదిత్య ఇలా జరగడానికి కారణం నువ్వు కదా.. అని కార్తీక్ ని నిలదీస్తుంటే.. నా బిడ్డను నేను వదిలేశానంటావా.. అని ప్రశ్నిస్తే.. నేను మాట్లాడుతుంది..తల్లి గురించి అని ఆదిత్య అనగానే కార్తీక్ నోరు ముయ్యి అని తమ్ముడిపై విరుచుకుపడతాడు.. అన్నకు ఎదురుతిరిగిన ఆదిత్య ఎందుకు ముయ్యలో చెప్పు.. అంటుంటే తండ్రి ఆనందరావు కలుగజేసుకుని ఆదిత్యా.. వాడు వినడురా.. అంటాడు ఆనందరావు. ‘తనకు తానే ఊహించేసుకుని అదే నిజం అని ఏళ్లుగా నమ్ముతూ ఇప్పుడు తనకే అన్యాయం జరిగిందని బాధపడుతున్నాడు.. ఇలాంటివాళ్లంటే నాకు అసహ్యంఅంటదు ఆదిత్య. నువ్వు అనుమానం అనే ఇనుపతెరలను కట్టేసుకుని బతుకుతున్నావంటూ కార్తీక్ ని నిండిచేసరికి ఆదిత్యా. అని ఆవేశంగా వేలు ఎత్తి మరీ వార్నింగ్‌లా అరుస్తాడు కార్తీక్‌. దాంతో ఆదిత్య ఆవేశంతో మీదమీదకు వెళ్తూ ‘ఏంటి కొడతావా.. రా కొట్టు..’ అంటూ కలబడిపోతాడు. సౌందర్య, ఆనందరావు వాళ్లని ఆపే ప్రయత్నంలో ఆనందరావుకు హాట్‌ ఎటాక్‌ వస్తుంది. ఆనందరావు సోఫాలో కూలబడిపోతాడు. మొత్తం కుటుంబం ఆనందరావు దగ్గరకు చేరుకుంటుంది. కార్తీక్ ఆదిత్యతో ‘అంబులెన్స్‌కి ఫోన్ చెయ్య్’ అంటాడు కంగారుగా ఇంతలో సౌందర్య దీపకు ఫోన్ చేస్తుంది. అయితే ఇద్దరి పిల్లల్ని ఒడిలో పడుకోబెట్టుకుని దీప ఏడుస్తూ ఉండగా.. సౌందర్య నుంచి ఫోన్ రావడం చూసి పిల్లలు చూడకుండా ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. పిల్లలు అడిగితే ఎవరో ఫోన్ చేశారు అని అబద్దం చెప్పేస్తుంది

వారణాసి తినడానికి ఏమైనా తెస్తాను అని అంటాడు. ఈ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అందుకనే నా బిడ్డలకు వండిపెట్టడానికి అయినా నేను బతికి ఉండాలిగా అంటుంది.. మరి ఆనందరావు పరిస్థితి దీపకు తెలుస్తుందా.. కార్తీక్ మోనిత మాయ నుంచి బయట పడతాడా తదితర వివరాలను నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.. !

Also Read :

ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ1 ఎక్స్‌‌‌‌ప్రెస్.. హాకీ ఆటగాడిగా ఆకట్టుకున్న సందీప్ కిషన్

ధోనీ టూ విరాట్ లగ్జరీ కార్ల కలక్షన్‌ చూశారా.. వారి కార్ల జాబితా మన కిరాణా జాబితా కంటే ఎక్కువ..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే..ఆ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!