Nenjam Marappathillai : నాలుగేళ్లుగా నలుగుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..

ఎన్నో అవాంతరాల మధ్య సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 'నెంజమ్ మరప్పతిళ్లై' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మార్చ్ 5 న ఈ సినిమా విడుదల అయ్యింది. ఎస్.జె. సూర్య, రెజీనా కాసాండ్రా,

Nenjam Marappathillai : నాలుగేళ్లుగా నలుగుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 05, 2021 | 9:43 AM

Nenjam Marappathillai movie : ఎన్నో అవాంతరాల మధ్య సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ‘నెంజమ్ మరప్పతిళ్లై’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మార్చి 5 న ఈ సినిమా విడుదల అయ్యింది. ఎస్.జె. సూర్య, రెజీనా కాసాండ్రా, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ సినిమా ‘నెంజమ్ మరప్పతిళ్ళై’.  జనవరి 2016 లో మొదలైన ఈ సినిమా అదే సంవత్సరం జూన్‌లో పూర్తయింది. అప్పటి నుండి  ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా వాయిదాపడుతూ వస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు ఈసినిమా విడుదలను నిలిపివేయాలని ‘నెంజమ్ మరప్పతిళ్ళై’ నిర్మాతల్లో ఒకరైన ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా రేడియన్స్ మీడియా కోర్టులో పిటీషన్ ధాఖలు చేసింది. తమకు రావాల్సిన  డబ్బులను సదరు నిర్మాత చెల్లించాలని అప్పటివరకు సినిమా విడుదలను ఆపేయాలని కోరారు. పిటిషన్ ఆధారంగా మద్రాస్ హైకోర్టు ఈ చిత్రం విడుదలను నిలిపివేసింది.

తాజాగా ఈ సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాత మదన్ రేడియన్స్ మీడియాకు పెండింగ్‌లో ఉన్న డబ్బును చెల్లించడంతో వివాదం ముగిసింది. దాంతో మద్రాస్ హైకోర్టు ఈ చిత్రం విడుదలకు స్టే ఇచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ విషయాన్ని దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్, జిఎల్‌ఓ స్టూడియోస్ మరియు సౌత్‌సైడ్ స్టూడియోలు సంయుక్తంగా నెంజమ్ మరప్పతిల్లైని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Shaurya and Puri Jagannadh : మరో యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..

Pooja Hegde : దళపతి సినిమాలో బుట్టబొమ్మ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బ్యూటీ.. ఏకంగా