Yadadri Temple to Re Open: యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవం ఎప్పుడు? మేలో ముహూర్తం!
యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు దాదాపు 6గంటల పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి..
Yadadri Re Open: యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు దాదాపు 6గంటల పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి నరసింహుడి ఆలయ పునర్‌నిర్మాణాన్ని అణువణువూ పరిశీలించారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్న నిర్మాణాన్ని చూసి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఉదయం యాదాద్రి చేరుకున్న కేసీఆర్ ముందుగా నరసింహడి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
శివాలయం, శివాలయం ఫ్లోరింగ్ ప్రాంతంలో ఎక్కువ సేపు గడిపారు కేసీఆర్. క్యూకాంప్లెక్స్ తీరూ గమనించారు. ఆ తర్వాత గర్భగుడి పనుల పురోగతిపై ఆరా తీశారు. భక్తులు వైకుంఠ క్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా యాదాద్రికి అంతిమ మెరుగులు ఉండాలని సూచించారాయన. దూరంగా కూర్చుని చూసినా కూడా మూలవిరాట్టుకు జరిగే సేవలు కనిపించాలన్నది కేసీఆర్ ఆలయ నిర్వాహకులకు చెప్పిన మాట.
ఇప్పటికే 90 శాతానికిపైగా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. యాదాద్రి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, అల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్ప సౌరభం ఉట్టిపడేలా పనులు కొనసాగుతున్నాయి. లక్ష్మినరసింహాస్వామి ఆలయ నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి.
గుడిపై విద్యుద్దీపాలంకరణ దేదీప్యమానం కావాలన్నారు కేసీఆర్. దేశంలో ఇకపై నిర్మించే ఆలయాలకు యాదాద్రి ఒక నమూనాగా నిలిచిపోవాలన్నారు. అద్దాల మండపాన్నీ వీక్షించిన సీఎం.. అదిరిపోయిందన్న కితాబిచ్చిట్లు తెలుస్తోంది. ఆలస్యంగా జరుగుతున్నాయి అనిపిస్తున్న లిఫ్ట్ పనుల విషయంలో మాత్రం వేగాన్ని పెంచాలని సూచించారట. స్వామి పుష్కరిణి పనులు, మెట్ల దారిలో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల్లోనూ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
యాదాద్రి ఆలయమే కాదు.. ఆలాయానికి వెళ్లే దారి కూడా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ మనం స్క్రీన్‌పై చూడొచ్చు. యాదాద్రి కొండపైకి కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆ దారిలో మలుపులు తీసుకొస్తున్న సోయగం చాలా అందంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఓ అమ్మాయి నలుగురితో పారిపోయింది..ఇంతకి ఆమెకు ఎవరితో పెళ్లైంది…? ఇప్పుడిదే పెద్ద చర్చ..!
Kerala Gold Scam: కేరళలో గోల్డ్ స్కామ్ ప్రకంపనలు.. కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు