Horoscope Today: ఈరోజు పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా.? అయితే ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి..
Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొత్తగా పనులు చేపట్టొచా.. లేదా..
Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొత్తగా పనులు చేపట్టొచా.. లేదా.. ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తవుతాయన్న విశేషాలు ఈరోజు రాశిఫలాల్లో చూద్దాం..
మేష రాశి:
మేష రాశి వారి ఈరోజు చేపట్టిన పనులు చురుకుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ప్రయోజనాలు కూడా సులువుగా పొందుతారు. మహాలక్ష్మి వారికి చెక్కర పొంగళి నివేదికగా సమర్పించడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అధిక శ్రమ కనిపిస్తోంది. వ్యాపార వ్యవహారిక విషయాల్లో పట్టుదలతో జాగ్రత్తగా వ్యవహరిస్తే కానీ.. ప్రయోజనాలు పొందే పరిస్థితి కనిపిస్తోంది. శివాభిషేకం చేస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈరోజు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎదుటి వారికి మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. పార్వతీ దేవీకి కుంకుమ అర్చన నిర్వహించుకోవడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
కర్కాటక రాశి:
ఈరాశి వారు వేరు వేరు రూపంలో రావాల్సిన బాకీలు కొంత ఆలస్యం అవుతుంటాయి.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సుబ్రమణ్య స్వామికి ప్రదర్శనాలు చేసుకోవడం, పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఈరోజు ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. గణపతి ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
కన్య రాశి:
ఈ రాశి వారు ఈరోజు వేరు వేరు రూపాల్లో రావాల్సిన బాకీల్లో కొంతమేరకే అందుకోగలుగుతారు. బ్యాంకు సంబంధిత ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత రహస్యంగా వ్యవహరించడం మంచిది. లలిత అమ్మవారి నామస్మరణ చేసుకుంటే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
తులా రాశి:
తులా రాశి వారికి అధిక శ్రమ కనిపిస్తోంది. బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో తొందరపాటు తనం కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు బంధువులతో గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు వచ్చే ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటూ ఉండాలి. పరమేశ్వరుడిని అభిషేకం శుభఫలితాలను కలిగిస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేయడంలో పెద్దవారి సహాయాన్ని పొందుతుంటారు. ‘శ్రీ రాజమాతంగా నమః’ అనే నామస్మరణ ఈరాశి వారికి మేలు చేస్తుంది.
మకర రాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు కొంతమేర మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవహారిక విషయాల్లో సాఫీగా ముందుకు వెళుతుంటారు. గణపతి ఆరాధన ఈ రాశివారికి మేలు చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి. ‘దుర్గ సప్త శ్లోకి’ పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మీన రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశ పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.