Chalukya Dynasty : ఈ ప్రాంతంలో అతీంద్రశక్తులు.. రాళ్లకు రాసలీల తెలుసు.. ప్రతి నిర్మాణం వెనుక అనేక కథలు కూడా

మన దేశంలో అనేక పురాతన దేవాలయాలు.. శిల్పకదక్షతకు పూర్వకాలం మేధస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. ఎన్నో ఆలయాలపై ముస్లిం రాజుల దండయాత్రలు చేసి.. వాటిని ధ్వంస చేశారు.. అయినప్పటికీ కొన్ని ఆలయాలు వాటి విశిష్టతను కోల్పోకుండా ఇంకా మన పూర్వీకుల చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటిల్లో ఒకటి కర్ణాటకలోని బాదామి, ఐహోలు, పట్టడకల్ ప్రాంతాలు.. ఈ ప్రాంతాల విశిష్టత మీ కోసం..

  • Surya Kala
  • Publish Date - 2:14 pm, Thu, 4 March 21
1/7
chalukya-dynasty-badami-1
కర్ణాటకలోని బాదామి ని చాళుక్యుల రెండో రాజధాని చేసుకుని దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలను పాలించారు. వీరికి శిల్పికళ పై మక్కువ ఎక్కువ. అందువల్లే ఆప్రాంతంలో అనేక దేవాలయాలు, గుహాలయాలను నిర్మింపజేశారు.దేవాతా మూర్తుల విగ్రహాలు ఎంత బాగా చెక్కారో శృంగార భరిత శిల్పాలను కూడా అంతే మనోహరంగా మలిచారు.
2/7
Durga-temple-Aihole
బాదామి కోట 25 మీటర్ల దూరంలో ఐహోలె ఉంటుంది. ఈ ప్రాంతం కూడా అనేక ఆలయాల సముదాయం. అందులో దర్గాదేవి దేవాలయం, లాడ్ ఖాన్ దేవాలయాలు ముఖ్యమైనవి. ఇక సందర్శకులు అప్పటి రాజుల విశిష్టతను తెలుసుకునే విధంగా ఒక మ్యూజియం కూడా ఉంది.
3/7
Banashankari-Amma-Temple-3
ఇక్కడ దేవాలయాల్లో మరో ముఖ్యమైన ఆలయం బనశంకరీదేవి ఆలయం, ఈ అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి సింహ వాహిని రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. బాదామి చాళుక్యులకు పూర్వమే ఇక్కడ బనశంకరి ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని మొదట అభివృద్ధి చేసింది చాళుక్య రాజైన ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రలో ఈ అమ్మవారు ఎంతో మందికి కులదేవత
4/7
malaprabha-river-parasuramu
మలప్రభ నదీ తీరంలో పరశురాముడు సంచరించాడని స్థానికుల కథనం. ఇప్పటికీ అక్కడ నది ఒడ్డున ఉన్న ఒక రాతిపై ఉన్న పాదం గుర్తులు ఆయనవే అంటారు అక్కడ గండ్రగొడ్డలి ఆకారంలో ఉన్న రాయిని పరశురాముడి ఆయుధంగా చెబుతారు. క్షత్రియులను వధించిన తర్వాత తన ఆయుధమైన గండ్ర గొడ్డలిని ఇక్కడ కడగడం వల్ల ఈ ప్రాంతమంతా ఎర్రగా మారిందని అంటారు.
5/7
chalukya-dynasty-virupaksha
పట్టడకల్ లో మొత్తం పది ఆలయాలుంటాయి. వీటన్నిటిని రెండో విక్రమాదిత్యుడు నిర్మిచడానికి చరిత్రకారులు గుర్తించారు. ఈ ఆలయాల్లో విరూపాక్ష ఆలయం, మల్లికార్జున ఆలయాలు చూడదగినవి. విరూపాక్ష ఆలయానికి దగ్గరగా ఉన్న నంది విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. అద్భుతమైన శిల్పకళతో భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి.
6/7
chalukya-dynasty-sangameshw
ఐహోలు కు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణా , ఘటప్రభ, మలప్రభ నదుల సంగమ ప్రదేశం ఉంది. ఇక్కడ ప్రముఖమైన శైవ దేవాలయాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైంది సంగమేశ్వర ఆలయం.
7/7
basaveswarudu
చరిత్రలో పరమ శివ భక్తుడుగా ప్రసిద్ధి చెందిన బసవేశ్వరుడు జన్మించిన ప్రాంతం. ఇక్కడే ఆయన సమాధి కూడా ఉంటుంది. దీనిని 12 శతాబ్దంలో నిర్మించినల్టు తెలుస్తోంది.