AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 4th Test Live: రెండో రోజు మొదలైన ఆట.. కష్టాల్లో భారత్…వరుసగా వికెట్లు

నరేంద్ర మోదీ స్టేడియంలో  టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట మొదలైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో..

India vs England 4th Test Live: రెండో రోజు మొదలైన ఆట.. కష్టాల్లో భారత్...వరుసగా వికెట్లు
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 05, 2021 | 3:46 PM

Share

IND vs ENG:  నరేంద్ర మోదీ స్టేడియంలో  టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట మొదలైంది. తొలి రోజు ఆటను  భారత్ 12 ఓవర్లకు 24/1 వికెట్‌తో ముగించింది. రోహిత్ శర్మ 8, చటేశ్వర పూజారా15 పరుగులతో క్రీజులో నిలిచారు. భారత్ ఇంకా 181 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ని అధిగమించవచ్చు. అయితే ఆఖరి 12 ఓవర్లు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇక భారత బౌలర్ల ధాటికి ఒక్కో పరుగు రాబట్టాలంటే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు తలకు మించిన భారమైంది. ఒక్కో బంతిని ఎదర్కోడానికి నానా తంటాలు పడ్డారు. భారత లెప్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లాండ్‌కి ప్రారంభంలోనే వికెట్లు తీసి కోలుకోకుండా చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. రెండో రోజు వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది భారత్.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ 42 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. పుజారా 17, విరాట్ 0 అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 27 పరుగులతో క్రీజ్ లో నిలకడగా ఆడుతున్నాడు. విరాట్ అవుట్ అవ్వడంతో రహానే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు. భారత్ మరో వికెట్ కోల్పోయింది. రహానే అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 27 పరుగులు చేసిన రహానే ఆండ్రసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు రహానే.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2021 02:12 PM (IST)

    వరుసగా వికెట్లను చేజార్చుకుంటున్న టీమిండియా..

    టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ ఆటగాళ్లు తడబడుతున్నారు. వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఇంగ్లాండ్ కంటే 53 పరుగులు వెనకబడి ఉంది భారత్. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో రిషబ్ పంత్ (35), వాషింగ్టన్ సుందర్ (1) ఉన్నారు

  • 05 Mar 2021 02:06 PM (IST)

    6 వికెట్ కోల్పోయిన టీమిండియా .. అశ్విన్ అవుట్

    టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోతుంది. 57 పరుగులు వెనకబడి ఉన్న భారత్ అశ్విన్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ 32 బాల్స్ లో 13 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.

  • 05 Mar 2021 01:13 PM (IST)

    5 వికెట్ కోల్పోయిన టీమిండియా ..

    5 వికెట్ కోల్పోయిన టీమిండియా .. రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 49 పరుగులదగ్గర అవుట్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ..

  • 05 Mar 2021 12:35 PM (IST)

    నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ.. ఆడుకుంటున్న హిట్ మ్యాన్

    వరుసగా వికెట్లు కోల్పోతున్న టీమిండియా. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ టీమిండియాను ఆదుకుంటున్నాడు. రహానే అవుట్ అవ్వడంతో క్రీజ్ లో రిషబ్ పంత్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 42 ఓవర్లకు 95/4

  • 05 Mar 2021 11:49 AM (IST)

    కష్టాల్లో భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. లంచ్ టైంకి స్కోర్ ఎంతంటే..

    టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ లో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. తొలిరోజు శుభమాన్ గిల్ వికెట్ ను కోల్పోయిన భారత్. రెండో రోజు వరుసగా  వికెట్లను చేజార్చుకుంటుంది. ఆరంభంలో పుజారా వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎక్కువసేపు కొనసాగలేక పోయాడు. పరుగులేమి చేయకుండానే వెనుతిరిగాడు. ఆతర్వాత వచ్చిన రహానే కూడా 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 80/4

  • 05 Mar 2021 11:38 AM (IST)

    నాలుగో వికెట్ కోలుపోయిన భారత్.. రహానే అవుట్

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రహానే అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 27 పరుగులు చేసిన రహానే ఆండ్రసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు రహానే. ప్రస్తుతం భారత్ స్కోర్ 34 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు

  • 05 Mar 2021 11:10 AM (IST)

    నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ, రహానే 32 ఓవర్లకు 55 పరుగులు

    టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో నాలుగో టెస్ట్ లో తలపడుతుంది రెండో రోజు ఆట కొనసాగుతుంది.  32 ఓవర్లకు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 55పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ 27, అజింకే రహానే 14 ఉన్నారు.

  • 05 Mar 2021 10:46 AM (IST)

    42 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయిన భారత్ .. క్రీజ్ లో రోహిత్-రహానే

    ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ 42 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. పుజారా 17, విరాట్ 0 అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 22పరుగులతో క్రీజ్ లో నిలకడగా ఆడుతున్నాడు. విరాట్ అవుట్ అవ్వడంతో రహానే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు.

  • 05 Mar 2021 10:43 AM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇండియా.. కెప్టెన్ కోహ్లీ అవుట్

    టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోతుంది. ఇప్పటికే పుజారా అవుట్ అవ్వగా ఇప్పుడు కెప్టెన్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 18బంతులు ఆడిన విరాట్ పరుగులేమి చేయకుండానే వెనుతిరిగాడు.

  • 05 Mar 2021 10:39 AM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్.. పుజారా అవుట్

    రెండో వికెట్ కోల్పోయిన భారత్ .. జాక్ లెచ్ బౌలింగ్ లో పుజారా అవుట్ అయ్యాడు. 66 బంతులు ఆడిన పుజారా 17 పరుగులు చేసాడు..

Published On - Mar 05,2021 2:12 PM