- Telugu News Photo Gallery Spiritual photos Hindu culture different types of puja flowers and their significance
Pooja Flowers and Specials : ఏ దేవుడికి ఏ పువ్వులంటే ఇష్టం.. పుష్పాలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా..!
మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అటువంటి వారి భక్తి నైవేద్యాన్ని దైవం తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు 'గీత'లో చెప్పాడు. అయితే వీటిల్లో పుష్పాలకు అత్యంత ప్రాధ్యానత ఇచ్చారు. ఇక ఏ దేవుడికి ఏ పుష్ప్తం ఇష్టం.. వీటితో పూజ చేయాలి తెలుసుకుందాం
Updated on: Mar 05, 2021 | 1:38 PM

విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలను ఆదుకునే విఘ్నేశ్వరుడికి తెల్లజిల్లేడు పువ్వులు ఇష్టం. అందుకని ఈ పుష్పాలతో పూజిస్తే భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక ఆది నారాయణుడు లోకబాంధవుడు సూర్య భగవానుడ్నిని కూడా తెల్ల జిల్లేడు పుష్పలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం

విష్ణు భగవానుని యొక్క ఏ పూజ అయినా తులసి లేకుండా సంపూర్ణమైనట్లుగా కాదు. విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్ష్యాత్తు శివుడే చెప్పాడట.

మహా శివుని కి మారేడు దళాల తో పూజించాలి. ఇలా మారేడు దళాల తో మహా శివునిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది భోళాశంకరుడు కోరిన వరాలని ఇస్తారు అని అంటారు. ఇక పవళ మల్లె పువ్వులతో పూజించినా జంగమయ్య అనుగ్రహిస్తాడని మంచి కోరికలు, ఆలోచనలు కలుగుతాయట.

గాయత్రి దేవిని పూజించినప్పుడు మల్లిక, పొగడ, కుశమంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాల తో పూజిస్తే చాల మంచి జరుగుతుందిట. గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది

శ్రీ చక్ర పూజకు తప్పకుండ తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్ర గన్నేరు, ఎర్ర కలువ పూలు, గురువింద పుష్పాలను ఉపయోగించాలి. ఇలా శ్రీ చక్రాన్ని ఈ పుష్పాల తో కనుక పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరి మంచి జరుగుతుందని నమ్మకం

శ్రీ మహా లక్ష్మిని తామర పువ్వుల తో పూజించాలి. అలానే లక్ష్మి దేవిని పూజించినప్పుడు ఆమెకి ఎంతో ప్రీతికరం అయిన ఎర్ర పుష్పాలు సమర్పించడం మంచిది. ఇలా చెయ్యడం వలన శ్రీ మహా లక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది అని అంటారు.




