అనారోగ్య సమస్యలను దూరం చేసే వెల్లుల్లి పచ్చడి..ఇలా చేస్తే క్షణాల్లోనే రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండి..

వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇక భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని వేయడం సంప్రదాయం అని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఘాటు,

అనారోగ్య సమస్యలను దూరం చేసే వెల్లుల్లి పచ్చడి..ఇలా చేస్తే క్షణాల్లోనే రుచికరంగా.. మీరు ట్రై చేసేయ్యండి..
Follow us

|

Updated on: Mar 04, 2021 | 7:25 PM

How To Make Garlick Pickle: వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇక భారతీయ వంటకాల్లో వెల్లుల్లిని వేయడం సంప్రదాయం అని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఘాటు, ఉప్పు, పులుపు రుచులు ఉంటాయి. అయితే దీనిని కేవలం వంటల్లో జత చేయడమే కాకుండా.. వెల్లుల్లి కారం, వెల్లుల్లి పచ్చడి ఇలా రకారకాలుగా చేస్తుంటారు. తెలంగాణలో ఎక్కువగా వెల్లుల్లి కారం చేసుకుంటుంటారు. దీనివలన జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి తొందరంగా కోలుకుంటారు. అయితే ఈ వెల్లుల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా.

కావాల్సిన పదార్థాలు..

వెల్లుల్లి – కప్పు ఆవనూనే – 4 టేబుల్ స్పూన్లు. మెంతులు – 1 టీస్పూన్

వంటకోసం..

లెమన్ జ్యూస్.. 2 టీస్పూన్స్ వెనిగర్…తగినంత మిరపపొడి.. తగినంత ఉప్పు.. తగినంత అవాలు.. 1టీస్పూన్ సోపు.. 1 టీస్పూన్ పసుపు.. 1టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్

తయారీ విధానం..

ముందుగా వెల్లుల్లి పాయలను తీసుకోని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణాలిలో ఆవాలు వేయించుకోని పోడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతులు, సోంపు వేయించి వాటిని కూడా పోడి చేసుకోవాలి. ఇక అదే బాణాలిలో కొంచెం నూనే వేసి ఇంగువ, నల్ల జీలకర్ర వేసి కలుపుతూ ఉండాలి. కాస్తా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోని కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి పాయలు మొత్తం బంగారు రంగులోకి వచ్చాక.. అందులో ఇంతకు ముందు రెడీ చేసుకున్న పొడిని వేసి.. పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిని 2 నుంచి 3 నిమిషాలు వేడి చేసి.. దించాలి. అందులో నిమ్మకాయ రసం తగినంత కలుపుకోవాలి. క్షణాల్లో ఆరోగ్యంగా వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోతుంది.

Also Read:

Telangana Femous Sakinalu: తెలంగాణ ఫేమస్ ‘సకినాలు’.. ఇలా చేస్తే రుచికరంగా వస్తాయటా… మీరు ట్రై చేయండి…