Food Wastage: ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా.. మనదేశంలో ఎంత వృధానో తెలిస్తే షాకే!

మిగిలిపోయిన ఆహార పదార్థాలను అన్నార్తులకు పంపిణీ చేస్తే ఎంతటి ఉపయోగమో ఎవరూ ఆలోచించరు. ఈ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆహారం వృధా అవుతుందో లెక్కలు తీసింది ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి.

Food Wastage: ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల టన్నుల ఆహారం వృధా.. మనదేశంలో ఎంత వృధానో తెలిస్తే షాకే!
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 06, 2021 | 8:10 PM

India tops in worldwide food wastage:  ఆహారం మనిషికెంత ముఖ్యమో దాన్ని పొదుపుగా వినియోగించడం.. వీలైతే అన్నార్తులకు అందించడం కూడా మన బాధ్యత. రకరకాల సందర్భాలలో వృధా అవుతున్న ఆహారాన్ని ప్రపంచ వ్యాప్తంగా లెక్కిస్తే ఎంతగా లెక్క తేలిందో చూస్తే మనం షాక్‌కు గురి కావాల్సిందే. పెళ్ళిళ్ళు, రకరకాల ఫంక్షన్ల పేరిట ఆహారాన్ని అవసరానికి మించి వండించడం ఆ తర్వాత దానిని పారవేయడం మన దేశంలో తరచూ చూస్తుంటాం. ఇలా మిగిలిపోయిన ఆహార పదార్థాలను అన్నార్తులకు పంపిణీ చేస్తే ఎంతటి ఉపయోగమో ఎవరూ ఆలోచించరు. ఈ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆహారం వృధా అవుతుందో లెక్కలు తీసింది ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి.

2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్‌ టన్నుల (దాదాపు 93 కోట్లు) ఆహారం వృథా అయ్యింది. అయితే మనం షాక్ గురయ్యే అంశమేంటంటే ఈ 931 మిలియన్ టన్నులలో భారత దేశం వాటా ఏకంగా 68.7 మిలియన్‌ టన్నులు. ఈ గణాంకాలను ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌ఈపీ) ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021లో ప్రకటించింది. 2019 సంవత్సరంలో వృథా అయిన ఆహారంలో 61 శాతం గృహాల నుంచి, 26 శాతం ఫుడ్‌ సర్వీసు సెంటర్లు, 13 శాతం రిటైల్‌ మార్కెట్‌ నుంచి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా కావడం గమనార్హం. వృధాగా పారవేసే ఆహారపదార్థాలను తగ్గించేందుకు అవేర్‌నెస్ ప్రోగ్రాం అవసరమని యూఎన్ఈపీ భావిస్తోంది.

వృధాగా పారవేస్తున్న ఆహార పదార్థాలను తరలించే ట్రక్కుల సంఖ్య కూడా భారీగానే వుంది. 40 మిలియన్ టన్నుల సామర్థ్యం గత రెండు కోట్ల 30 లక్షల ట్రక్కులను వృధాగా పారవేసే ఆహార పదార్థాల కోసం వినియోగిస్తున్నట్లు లెక్క తేలింది. ఈ ట్రక్కులను వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఆనుకునేలా నిలిపితే భూగోళాన్ని ఏడుసార్లు చుట్టేయవచ్చంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో ప్రతి ఇంట్లో ఏటా 50 కిలోల ఆహారం వృథాగా మారిపోతున్నట్లు అంచనా. అంటే దేశవ్యాప్తంగా ప్రతిఏటా 6,87,60,163 టన్నుల తిండి వేస్ట్ అవుతోంది. అమెరికాలో ఇది 1,93,59,951 టన్నులు కాగా, చైనాలో 9,16,46,213 టన్నులుగా లెక్క తేలింది. ఇళ్ళల్లో అందుబాటులో ఉన్న ఆహారంలో 11 శాతం పనికిరాకుండా పోతోంది. ఫుడ్‌ సర్వీసు సెంటర్లలో 5 శాతం, రిటైల్‌ ఔట్‌లెట్లలో 2 శాతం ఆహారం వృథా అవుతోంది. కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి సమతౌల్యం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి ప్రతికూల పరిణామాలను ఆపాలంటే తొలుత ఆహార వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇంగర్‌ ఆండర్సన్‌ సూచించారు. ఆహార వృథాను అరికడితే ప్రపంచాన్ని కాపాడినట్లేనని పిలుపునిచ్చారు.

ALSO READ: కారు బాంబుతో దద్దరిల్లిన సోమాలియా.. ఇరవై మంది దుర్మరణం..

ALSO READ: ఉత్పాతానికి కారణాలు కనుగొన్న శాస్త్రవేత్తలు.. అవి విరిగి పడడం వల్లే ఉధృతి పెరిగింది

ALSO READ: ఏకంగా 10 లక్షల మందికి కుచ్చు టోపీ..రూ.1500 కోట్లు లూఠీ

ALSO READ: రాజకీయ పార్టీలను కుదిపేస్తున్న సెక్స్ స్కాండల్స్.. కన్నడ నాట మరీ అధికం.. అమెరికాలోను అంతే!

ALSO READ: చిన్నమ్మ రాజకీయ సన్యాసం వెనుక ‘ఆ’ ఇద్దరు దూతలు