ఏపీలో అత్యల్ప స్థాయికి చేరిన కరోనా కేసులు.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య..
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,90,556కి చేరింది. ఇందులో 921 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,82,462 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7173కు చేరుకుంది. ఇక నిన్న 93 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,41,90,477 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 6, చిత్తూరు 32, తూర్పుగోదావరి 5, గుంటూరు 6, కడప 8, కృష్ణా 20, కర్నూలు 5, నెల్లూరు 0, ప్రకాశం 0, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 06/03/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,661 పాజిటివ్ కేసు లకు గాను *8,79,567 మంది డిశ్చార్జ్ కాగా *7,173 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 921#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Im5TQfDhHS
— ArogyaAndhra (@ArogyaAndhra) March 6, 2021
Also Read:
Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!
ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!
అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!