ఒక్క సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్.. ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యువల్‌.. అందుబాటులోకి రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే నానాతంటాలు పడాల్సిందే. ఇక ఆ కష్టాలన్ని తీరనున్నాయి. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే ఇంటినుండే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయొచ్చు.

ఒక్క సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్..  ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యువల్‌.. అందుబాటులోకి రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 06, 2021 | 9:07 PM

Driving License Renewal : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే నానాతంటాలు పడాల్సిందే. ఇక ఆ కష్టాలన్ని తీరనున్నాయి. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే ఇంటినుండే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయొచ్చు. ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక, నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే వారు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎక్కడుంటే అక్కడే లైసెన్స్ పొందే అవకాశాన్ని రాష్ట్ర రవాణా శాఖ కల్పిస్తోంది. కేవలం ఒక్క సెల్పీ దిగి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు పని పూర్తైపోతుంది. ఈ నెలాఖరుు నుంచి దీన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఫ్యాన్సీనంబర్లు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా దక్కించుకునే అవకాశం కల్పించిన రవాణాశాఖ సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ రోజుల ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఒక రోజు వెళితే పని అవుతుందనే గ్యారంటీ అసలు లేదు. ఇక అధికారులకు ఎంతో కొంత చేతిలో పడాల్సిందే. అయితే, ఇప్పటినుంచి అలాంటి కష్టాలు ఇక ఉండవు. ఎంతో చక్కగా ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు.

తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్‌లో 18 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా రెన్యూవల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. parivahan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి

2. అందులోని ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఆప్షన్ ఎంచుకోండి

3. ఆ తర్వాత మీ రాష్ట్రం పేరును ఎంచుకుని డేట్ ఆఫ్ బర్త్ , డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్ కోడ్ వివరాలు ఇవ్వండి

4. తర్వాత మీ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి

5. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఒక మెసేజ్ వస్తుంది.

6. రెన్యూవల్ ఛార్జీని ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ అవుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!