Gold Mountain Discovered: ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..

బంగారం.. మగువుల మనసు మెచ్చే మెటల్. రేటు ఎప్పుడు తగ్గుతుందా.. దాచుకున్న డబ్బుతో ఎప్పుడు బంగారం కొందమా అని చూస్తా ఉంటారు చాలామంది.

Gold Mountain Discovered:  ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..
Follow us

|

Updated on: Mar 07, 2021 | 2:18 PM

Gold Mountain Discovered: బంగారం.. మగువుల మనసు మెచ్చే మెటల్. రేటు ఎప్పుడు తగ్గుతుందా.. దాచుకున్న డబ్బుతో ఎప్పుడు బంగారం కొందమా అని చూస్తా ఉంటారు చాలామంది. పసిడిని గ్రాముల్లో కొనాలన్నా కూడా లక్షల్లో డబ్బులు కావాలి. కానీ ఒక్కసారిగా బంగారం కొండ కనిపిస్తే.. ఇంకేముందు తట్టా, పార తీసుకుని తవ్వుకోని రావడమే. అదే జరిగింది డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగోలో. తవ్వే కొద్ది బంగారం బయటపడుతుంది. ఈ విషయం స్థానికులకు తెలిసిపోవడంతో.. పెద్ద, పెద్ద సంచుల్లో బంగారాన్ని తవ్వకోని ఇంటికి తెచ్చుకుంటున్నారు. అక్కడ తిరుమల టెంపుల్‌లో కంటే ఎక్కువ రద్దీ ఏర్పడింది. సౌత్‌ కివు ప్రావిన్స్‌, లుహిహిలో ఉన్న ఈ కొండ‌పై ఉన్న‌ మట్టిలో 60 నుంచి 90 శాతం బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి బంగారంలా క‌న‌ప‌డిన ప్ర‌తి రాయినీ స్థానికులు సంచుల్లో వేసుకుంుటన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘ‌ట‌న కాంగోలో చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఆ మట్టిని చాలా మంది ఇంటికి తీసుకెళ్లి శుభ్రపరిచి బంగారాన్ని వేరు చేస్తుండగా, మ‌రి కొంద‌రు అక్క‌డే దాన్ని శుభ్రం చేసి అందులో బంగారం మాత్రమే సేకరిస్తున్నారు. దీంతో కాంగో మైనింగ్‌ శాఖ అలర్టైంది. ఆ కొండపై బంగారాన్ని తవ్వుకోవడానికి ఎవ్వ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని ఆంక్షలు పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అక్కడ మైనింగ్ నిషేధిస్తున్నట్లు తెలిపింది. కాగా కలప, వజ్రాలు, ఖనిజాలు వంటి సహజ నిక్షేపాలు కాంగో బాగా ప్రసిద్ది చెందింది. అక్కడ బంగారం నిక్షేపాలు కూడా అధికమే. 

Also Read:

షర్మిల ఆవిష్కరించిన వైఎస్‌ఆర్ విగ్రహం ధ్వంసం.. ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడనున్న పాకిస్తాన్ యువ పేపర్.. పూర్తి వివరాలు ఇవిగో…