Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి… ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ

Corona Effect: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా .

Corona Effect: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి... ఆ మూడు రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు: ఆరోగ్యశాఖ
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 08, 2021 | 1:25 PM

Corona Effect: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇక తమిళనాడుకు వెళ్లాలంటే ఈ-పాస్‌ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాల వారికి మినహాయింపు ఇచ్చారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఈ చర్యలు చేపట్టింది. తమిళనాడులోని కేసుల సంఖ్య బాగానే పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలోనే కేసులు పెరుగుతున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. దీంతో తమిళనాడులోకి వెళ్లాలంటే, ఈ–పాస్‌ పొందాల్సిందేనన్న ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరిల నుంచి వచ్చే వారికి మాత్రం ఈ-పాస్‌ నుంచి మినహాయింపు కల్పించనున్నట్లు తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడకు నేరుగా వచ్చే వాళ్లు, ఇతర రాష్ట్రాల మీదుగా విదేశాల నుంచి తమిళనాడులోకి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఈ–పాస్‌ పొందాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా, తమిళనాడులో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ పెరుగుతుండటంతో తమిళ సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో కూడిన ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది. కరోనా నిబంధనలను మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది తమిళ సర్కార్‌. మస్క్‌లు ధరించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు విధిస్తోంది తమిళ ప్రభుత్వం.

కాగా, ఆదివారం కరోనా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో మళ్లీ కలకలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 11,141 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇవి చదవండి : Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న కరోపా పాజిటివ్‌ కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న కువైట్‌

New Covid-19 : మళ్లీ కరోనా కాటు, అప్రమత్తంగా ఉండాలంటూ 8 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు