Silver Price Today: ఉరుకులు పరులు లేకుండా నిలకడగా ఉన్న వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Silver Price Today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం సోమవారం నిలకడగా ఉంది. దేశీయంగా బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులు మార్పులు చోటు ...

Silver Price Today: ఉరుకులు పరులు లేకుండా నిలకడగా ఉన్న వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Silver Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Mar 08, 2021 | 5:21 AM

Silver Price Today: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం సోమవారం నిలకడగా ఉంది. దేశీయంగా బంగారం, వెండి ధరల్లో గత కొన్ని రోజులు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం ధర కొన్ని రోజులు తగ్గగా, ఈ రోజు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉంది. దేశీయంగా తాజా ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కిలో వెండి రూ.65,700 ఉంది. అలాగే బెంళూరులో రూ. 65,800, చెన్నైలో రూ.70,100, కోల్‌కతాలో రూ.65,700, హైదరాబాద్‌ రూ.70,100 ఉండగా, విజయవాడలో రూ.70,100 ఉంది,. ఇక విశాఖలో కిలో వెండి ధర రూ.70,100 వద్ద కొనసాగుతోంది.

కాగా, దేశీయంగా పరిశీలిస్తే బంగారం, వెండి ధరలపై ఎఫెక్ట్‌ చూపే అంశాలు చాలా ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి చదవండి :

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ

National Pension System: కేంద్రం అనుమతి.. మీరు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తున్నారా..? మీకో శుభవార్త