Alzheimers: ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టండి.. లేకపోతే ‘అల్జీమర్స్’ బారిన పడినట్లే.. ఎందుకంటే..?

Alzheimer's risk: దైనందిన జీవితంలో ఒత్తిడి, జీవనశైలి, ఆహారం ఇవన్నీ రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ఇలా ప్రతీ కారణాలతో మనిషి సులవుగా మతిమరుపు బారిన పడతున్నాడు. అయితే..

Alzheimers: ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టండి.. లేకపోతే ‘అల్జీమర్స్’ బారిన పడినట్లే.. ఎందుకంటే..?
Follow us

|

Updated on: Mar 08, 2021 | 8:54 PM

Alzheimer’s risk: ఆధునిక ప్రపంచంలో.. ఉరుకులు పరుగుల జీవితం అందరినీ పలు సమస్యల బారిన పడేలా చేస్తోంది. మనిషి.. మర మనిషిగా మారి ప్రపంచంలో పరుగెడుతున్నాడు. దీంతోపాటు దైనందిన జీవితంలో ఒత్తిడి, జీవనశైలి, ఆహారం ఇవన్నీ రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ఇలా ప్రతీ కారణాలతో మనిషి సులవుగా మతిమరుపు బారిన పడతున్నాడు. అయితే ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి క్రమేణా.. 30 నుంచి 50 ఏళ్ల లోపు వారిలో కూడా కనిపిస్తుండటం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. మతిమరుపుకు ప్రధాన కారణం ‘అల్జీమర్స్‌’ వ్యాధి. మెదడులోని కణాలు పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో అమైలాయిడ్‌ పప్టైడ్‌ అనే ప్రొటీన్‌ ఎక్కువ మోతాదులో పేరుకుపోవడం వల్ల నాడీ కణాలకు, శరీరంలోని ఇతర కణాలకు మధ్య సంబంధం తెగిపోతుంది. క్రమేణా మతిమరుపు కాస్త.. అల్జీమర్స్‌ వ్యాధిగా రూపాంతరం చెందుతుంది. అయితే దీనిని అరికట్టేందుకు ఎన్నోరకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ముఖ్యంగా మన ఆహార అలవాట్లతో అల్జీమర్స్ నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు. వైద్య నిపుణులు. దీనివల్ల మతిమరుపు సమస్య ఉన్నా.. సులువుగా బయటపడవచ్చని సూచిస్తున్నారు. దీనికోసం వైద్య నిపుణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటున్నారో ఇప్పుడు చూద్దాం..

ఎలాంటి ఆహారం తినకూడదంటే..

రెడ్ మీట్: ఇందులో ఐరన్ ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అతిగా ఐరన్ తినడం వల్ల మెదడులో వయస్సును పెంచే గ్రంథి యాక్టివ్ అవుతుంది. కావున ఐరన్ లాంటి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

పిండి, చక్కెర పదార్థాలు: సాధారణ ఆహారం తినేవారితో పోల్చితే పిండి పదార్థాలు, చక్కెర అతిగా తీసుకునేవారికి ఆల్జిమర్స్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు అధికమని పరిశోధకులు వెల్లడించారు. అలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఫ్రైస్, నూనే పదార్థాలు: బాగా నూనెలో బాగా వేయించిన ఆహారం, లేదా ఫ్రై చేసిన పదార్థాల వల్ల ఆల్జీమర్స్ ఏర్పడతాయి. ఈ పదార్థాల్లో అల్జిమర్స్‌ ఏర్పడటానికి కారణమయ్యే ‘బీటా అమైలాయిడ్‌’ అనే విషతుల్య ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పాప్‌కార్న్: పాప్ కార్న్ తినడం మంచిదే. కానీ, మైక్రోవేవ్‌లో పెట్టి తయారు చేసే పాప్ కార్న్ మాత్రం అస్సలు మెదడుకు మంచిది కాదని సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మెదడులో ‘బీటా అమైలాయిడ్‌’ ఉత్పత్తి అయి ఆల్జీమర్స్ వస్తుంది.

శుద్ది చేయని ఆహారం: శుద్ధిచేసిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, బయట లభించే శుద్ధి చేయని కూరగాయలు, పండ్లు తదితర ఆహారాల వల్ల అల్జీమర్స్ ఏర్పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై ఉండే పురుగు మందుల అవశేషాల వల్ల మెదడుకు ముప్పు పెరుగుతుంది.

Also Read: Benefits of Eggs: ప్రతీరోజూ మూడు గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..

Latest Articles