Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trikonasana : మీ కాళ్ళు బలహీనంగా ఉన్నాయా.. చీలమండల నొప్పా.. ఈ ఆసనం మీ కోసమే..!

యోగా ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన ఓ దివ్య వ్యాయామం. మనిషి జీవితంలో ఆధునికత పేరుతో రోజు రోజుకీ మారుతున్న జీవన విధానం. మారిన ఆహారపు అలవాట్లు...

Trikonasana :  మీ కాళ్ళు బలహీనంగా ఉన్నాయా.. చీలమండల నొప్పా.. ఈ ఆసనం మీ కోసమే..!
Follow us
Surya Kala

|

Updated on: Mar 08, 2021 | 9:07 PM

Trikonasana  : యోగా ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన ఓ దివ్య వ్యాయామం. మనిషి జీవితంలో ఆధునికత పేరుతో రోజు రోజుకీ మారుతున్న జీవన విధానం. మారిన ఆహారపు అలవాట్లు ఇక శరీరానికి తగినంత శ్రమ లేకపోవడంతో.. అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్రతి వ్యాధికి మెడిసిన్స్ వాడడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. దీంతో రోజు కొంచెం శ్రద్ధ పెట్టి యోగాసనాలను వేస్తె.. చాలా వరకూ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అంతేకాదు ఈ ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడతాయి. ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. ఈరోజు మనం త్రికోణాసనం ఎలా వేయాలి.. దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం..!

త్రికోణాసనం వేయు విధానం :

నిఠారుగా నిలబడి… శ్వాస పీలుస్తూ రిలాక్స్ గా విడవాలి. వెన్నెముకను నిఠారుగా నిలిపి.. రెండు కాళ్ళను వీలైనంత దూరంగా జరపాలి. రెండు చేతులను నిదానంగా పైకి లేపి .. భూమికి సమాంతరంగా ఉంచాలి. అనంతరం కుడి చేతిని కుడి పాదాన్ని తాకుతూ మెల్లగా శరీరాన్ని బెండ్ చేయాలి. ఇక అదే సమయంలో ఎడమ అరచేతిని పైకెత్తి నిటారుగా ఉంచాలి. తల ఎడమ అరచేతి వైపు తిప్పి దానిని చూస్తూ ఉండాలి. తర్వాత శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఇక కుడి చేతివైపు ఏ విధంగా శరీరాన్ని వంచి చేశామో.. నెక్స్ట్ అదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి.

ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు :

త్రికోణాసనం వేయడం వలన కాలి కండరాలకు మంచి బలం చేకూరుతుంది. చీలమండలలో శక్తి పుంజుకుంటుంది. వెన్నునొప్పి ని నివారిస్తుంది. మెడ నొప్పులు తగ్గి ఈజీగా తిప్పగలమని యోగా నిపుణులు చెబుతున్నారు. ఉదరం బలంగా అవుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

Also Read:

 తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. బిగ్‌బాస్ సీజన్4 ఫేం అలేఖ్య హారికను వరించిన బంపర్ ఆఫర్..

నగ్న వీడియోల పేరుతో వ్యాపారికి బెదిరింపులు.. ఇంటికి పిలిచి తల్లి, కొడుకుల మోసం.. లక్షల్లో లూటీ.!!