నగ్న వీడియోల పేరుతో వ్యాపారికి బెదిరింపులు.. ఇంటికి పిలిచి తల్లి, కొడుకుల మోసం.. లక్షల్లో లూటీ.!!

Crime News Latest: వ్యాపారవేత్తను బెదిరించి 15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. నగ్న వీడియోలు ఉన్నాయని చెప్పి వ్యాపారవేత్తను...

  • Ravi Kiran
  • Publish Date - 8:26 pm, Mon, 8 March 21
నగ్న వీడియోల పేరుతో వ్యాపారికి బెదిరింపులు.. ఇంటికి పిలిచి తల్లి, కొడుకుల మోసం.. లక్షల్లో లూటీ.!!

Crime News Latest: వ్యాపారవేత్తను బెదిరించి 15లక్షలు దోచుకున్న మహిళ కటకటాల పాలైంది. నగ్న వీడియోలు ఉన్నాయని చెప్పి వ్యాపారవేత్తను బ్లాక్‌మెయిల్ చేసిన ఓ మహిళ భారీగా డబ్బులు దండుకుంది. ఇందుకు ఆమె కుమారుడు కూడా సహకరించాడు. దీంతో పోలీసులు వారిద్దరని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాకటలోని హుస్పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కొప్పళ్‌లో స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఓ వ్యాపారవేత్త హోస్పేటలోని ఎంజే నగరలో తన ఆఫీస్‌ తెరిచాడు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఉండే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో తరచూ..అతడు ఆమె ఇంటికి కూడా వెళ్లేవాడు..ఇదే అదునుగా సదరు కిలాడీ లేడి…వ్యాపారవేత్తను బురిడి కొట్టించేందుకు ప్లాన్ చేసింది..టీలో మత్తుమందు కలిపి అతడు మూర్చపోయేలా చేసింది. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన వ్యాపారవేత్త.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.

ఇది జరిగిన రెండు రోజులకు ఆ వ్యాపారవేత్తకు ఫోన్ చేసిన సదరు మహిళ.. అతని నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని బెదిరించింది. ఆ వీడియోలు కావాలంటే తనకు 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో అతడు చేసేది లేక …ఆమె బ్యాంక్ అకౌంట్‌కు 15 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే మిగిలిన 15 లక్షల కోసం అతని చేసింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆ మహిళ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా..2.750 గ్రాముల గంజాయి లభించింది. మహిళను ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు..తమదైన స్టైల్లో విచారించగా..అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!