AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాప్ టాప్, మొబైల్‌ను పురుషులు ఇలా వాడుతున్నారా… అయితే ముప్పుతప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు

ప్రకృతి పై మానవ మేథస్సు పై చేయి సాధించింది అనుకున్నప్పుడు.. మళ్ళీ ప్రకృతి మనిషికి సవాల్ విసురుతుంది.. క్లోరోఫిల్ వల్ల ఆకులకు పచ్చదనం అని చెప్పిన మనిషి .. మరి ఆ క్లోరోఫిల్ కు ఎవరు...

ల్యాప్ టాప్, మొబైల్‌ను పురుషులు ఇలా వాడుతున్నారా... అయితే ముప్పుతప్పదని హెచ్చరిస్తున్న   వైద్యులు
Surya Kala
|

Updated on: Mar 08, 2021 | 9:32 PM

Share

Lap-Top and Cell Phone : ప్రకృతి పై మానవ మేథస్సు పై చేయి సాధించింది అనుకున్నప్పుడు.. మళ్ళీ ప్రకృతి మనిషికి సవాల్ విసురుతుంది.. క్లోరోఫిల్ వల్ల ఆకులకు పచ్చదనం అని చెప్పిన మనిషి .. మరి ఆ క్లోరోఫిల్ కు ఎవరు పచ్చదనం నింపారు అంటే చెప్పడానికి నీళ్ళు నములుతాడు.. మానవ శరీరం నిరతరం మండుతూనే ఉంటుంది అనడానికి సాక్షం.. మనం విడిచే గాలి.. కార్చే కన్నీరు..మూత్రం వేడి వేడి.. మరి అంతగా లోపల మండుతున్నా మనలోకి ఇతర భాగాలు ఏవిధంగా ఇబ్బందులు పడవు ఎందుకు అంటే సమాధానం చెప్పలేము.. అవును మానవ శరీర నిర్మాణం ఓ చిత్రమైంది. ఫలానా అవయవం ఈ పని చేస్తుంది అని చెప్పగలం కానీ.. ఎందుకు నిర్మాణమైంది అని అంటే చెప్పలేము.. అలాంటి అవయవాల్లో పురుషుల్లో ఉండే వృషణాలు ఒకటి.. ఇవి దేహం లోపల ఉంటాయి.. కాగా ఈ వృషణాలకు పుల్లలు పుట్టక పోవడానికి సంబంధం ఉంది.. అది ఏ విధంగా అనే వివరాల్లోకి వెళ్తే…

మన శరీర ఉష్ణోగ్రత సాధారణం గా 98.6 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది.. కానీ వృషణాలకు మాత్రం అంతకంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉండాల్సి ఉంటుంది. అలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే వీర్యం తయారయ్యి.. శుక్ర కణాల కదలిక సరిగ్గా ఉంటుంది.. అదే వృషణాలకు వేడి ఎక్కువగా తగిలితే.. వీర్యం నాశనం అవుతుంది.. వీర్యంలో ఉండాల్సిన శుక్రకణాలు కూడా ఉండవు.. ఉన్నా వేడి తగిలితే చలించవు.. అటువంటి లక్షణాలున్న పురుషులకు పిల్లలు పుట్టరు.. ఎక్కువ వేడి ఉన్న చోట పనిచేసే పురుషులకు పిల్లలు పుట్టక పోవడానికి మెయిన్ రీజన్ వేడి అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.. కాగా ఇటీవల పురుషుల్లో పిల్లలు పుట్టక పోవడానికి మరో రీజన్ కూడా ఉంది అని చెబుతున్నారు.. అదే ల్యాప్ టాప్, మొబైల్ ఎక్కువగా వాడే పురుషులకు కూడా పిల్లలు పుట్టే అవకాశం తక్కువట.. ల్యాప్ టాప్, మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్, వేడి వల్ల వీర్యం నశిస్తుంది.. అందుకనే పురుషులు మొబైల్స్ ను జేబుల్లో పెట్టుకోవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.. ఇక చాలా మంది ల్యాప్ టాప్ లను ఒడిలో పెట్టుకొని పనిచేసుకొనే పురుషులు .. ఏ డెస్క్ మీదైనా పెట్టుకొని పని చేసుకోవాలని చెబుతున్నారు.. ల్యాప్ టాప్ లు ఎక్కువగా ఒడిలో పెట్టుకొని పని చేసే పురుషుల్లో వీర్యం నాశనం అయి.. శుక్రకణాల కదలిక తక్కువగా ఉండి.. పిల్లలు పుట్టే అవకాశం కోల్పోతారని.. కనుక పురుషులు ల్యాప్ టాప్, మొబైల్స్ వాడే విషయం లో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read:

ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే మీరు రైలు ప్రయాణం చేయవచ్చు.. ఎలాగో తెలుసా…! అయితే

 మీ కాళ్ళు బలహీనంగా ఉన్నాయా.. చీలమండల నొప్పా.. ఈ ఆసనం మీ కోసమే..!