Benefits of Eggs: ప్రతీరోజూ మూడు గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..

Benefits of Eating Three Eggs: గుడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. గుడ్లల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. గుడ్లను..

Benefits of Eggs: ప్రతీరోజూ మూడు గుడ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..
Benefits of Egg
Follow us

|

Updated on: Mar 08, 2021 | 6:56 PM

Benefits of Eating Three Eggs: గుడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.. గుడ్లల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరుపితమైంది. గుడ్లను ప్రతిరోజూ మితంగా తినాలని.. లేకపోతే.. అనార్థాలు తప్పవంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే రోజూకు మూడు గుడ్లు తినవచ్చనేది వైద్య నిపుణుల వాదన. గుడ్డు తినడం వల్ల కండరాల ఫిట్‌నెస్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. గుడ్ల మీ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. దీంతోపాటు బరువును తగ్గించడంలో చాలా ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున ప్రతిరోజూ మూడు గుడ్లు తింటే బలంగా.. ధృఢంగా తయారు కావొచ్చని.. పలు రోగాల నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

పోషకాల నిధి.. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృఢంగా తయారు చేస్తుంది. అందుకే గుడ్లను ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటిగా పరిగణిస్తారు. గుడ్లలో కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి 5, విటమిన్ బి 12, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6 వంటి పోషకాలు ఉన్నాయి.

మూడు గుడ్లు ఎందుకు తినాలంటే.. రోజుకు మూడు గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ తింటే.. అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చిని ఇది పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. కావున ఈ రోజు నుంచే మీరు కూడా ఆహారంలో మూడు గుడ్లు చేర్చుకుంటే.. మేలను అభిప్రాయపడుతున్నారు.

ఆరోగ్యకరమైన ఎల్‌డిఎల్ బ్లడ్ కొలెస్ట్రాల్‌తో పోలిస్తే గుడ్లు శరీరానికి మరింత శక్తినిచ్చే పోషకాలని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్లలో ట్రిప్టోఫాన్, టైరోసిన్ ఉంటాయి. అదనంగా గుడ్లలో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి కావున ఇవి గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Rice or Roti : రాత్రి పూట అన్నంకి బదులు చపాతీ తింటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం..

Chicken Rates Hike : చికెన్ ప్రియులకు ఊహించని షాక్.. తెలంగాణలో భారీగా పెరిగిన ధరలు.. కిలో చికెన్ ధర ఎంతంటే..?