Chicken Rates Hike : చికెన్ ప్రియులకు ఊహించని షాక్.. తెలంగాణలో భారీగా పెరిగిన ధరలు.. కిలో చికెన్ ధర ఎంతంటే..?

Chicken Rates Hike: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా తెలంగాణలో అమాంతం పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి జనాలందరు

Chicken Rates Hike : చికెన్ ప్రియులకు ఊహించని షాక్.. తెలంగాణలో భారీగా పెరిగిన ధరలు.. కిలో చికెన్ ధర ఎంతంటే..?
Follow us

|

Updated on: Mar 08, 2021 | 1:18 PM

Chicken Rates Hike: ఇప్పటికే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు తోడు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు కూడా తెలంగాణలో అమాంతం పెరిగిపోయాయి. దీంతో మధ్యతరగతి జనాలందరు లబో దిబో మంటున్నారు. ఒక్క వారంలోనే రూ.70 వరకు పెరిగింది. ఆదివారం కిలో చికెన్ రూ. 250 దాకా పలికింది. దీంతో ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు అన్నట్టుగా మారిపోయింది తెలంగాణలో పరిస్థితి.

చికెన్ ధర కూడా భారమై పోయింది. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధర మళ్లీ ఆకాశాన్ని తాకుతోంది. వారం వ్యవధిలోనే కిలోకు రూ.50-70కి పైగా పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లోని కిలో చికెన్ ధర రూ.250కు తాకిందంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గత వారం రూ.160-180 మధ్య ఉన్న కోడి మాంసం ధర ఒక్క వారంలోనే రూ.250కి చేరుకోవడం చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూ ప్రచారంతో తెలంగాణలో కోళ్ల ఉత్పత్తిని చాలామంది ఆపేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగిన సరఫరా చేయలేకపోతున్నామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని, ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంటున్నారు. రెండేళ్లుగా తాము అనేక కష్టనష్టాలు పడుతున్నామని, కరోనా పౌల్టీ పరిశ్రమను మరింత కుంగదీసిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పెరుగుతున్న ధరతో పరిశ్రమ కొంత కోలుకునే అవకాశముందంటున్నారు. మునుముందు ఇంకా ధరలు భారీగా పెరిగే అవకాశమున్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే చికెన్ తినడం కష్టమే అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Top 5 Mileage Bikes: లీటర్ పెట్రోల్‌కి 99 కిలోమీటర్ల దూరం.. అతి తక్కువ ధరలో మైలేజ్ ఇచ్చే బైకులు ఇవే..

Chicken Prices: బర్డ్ ప్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పడిపోతున్న చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో చికెన్ ధర ఎంతంటే..