Rice or Roti : రాత్రి పూట అన్నంకి బదులు చపాతీ తింటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం..

Rice or Roti: బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకకునే ప్రతి ఆహారం క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వారు చేసే మార్పు రాత్రి పూట అన్నంకి బదులు

Rice or Roti : రాత్రి పూట అన్నంకి బదులు చపాతీ తింటున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే మీకే నష్టం..
Follow us
uppula Raju

| Edited By: Team Veegam

Updated on: Mar 09, 2021 | 7:27 PM

Rice or Roti: బరువు తగ్గాలనుకునే వారు డైట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకకునే ప్రతి ఆహారం క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా వారు చేసే మార్పు రాత్రి పూట అన్నంకి బదులు బ్రేక్ ఫాస్ట్ చేయడం. మరీ ముఖ్యంగా చపాతీ తినడం ఇలాంటివి. దీని వల్ల అనుకున్నంతగా బరువు తగ్గుతారు.. ఫలితం ఉంటుందా తెలుసుకోండి..

బియ్యం, గోధుమలు ఆహారం విషయంలో రెండూ ముఖ్యమే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం… కానీ బరువు తగ్గే విషయానికి వస్తే, మొదట ఈ రెండు ఆహారాలపైనే దృష్టి పెడతాం, ఎందుకంటే ఈ రెండింటిలో బరువు తగ్గటానికి ఏది ఎక్కువ సహాయపడతుందా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ రెండూ కార్బోహైడ్రేట్స్‌తో నిండి ఉంటాయి. అయితే, బరువు తగ్గడానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. వంటకాల్లో మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి . బరువు తగ్గడానికి, మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించాలి. అందువల్ల, తక్కువ కార్బోహైడ్రేట్స్‌తొ కూడిన ఆహారం బరువు తగ్గడానికి అనువైనది.

అన్నం, చపాతీ వీటిని మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో ఉంటాయి. వీటిని మనం తరచుగా తీసుకుంటాం. అయితే రెండింటిలో ఏ ఆహారం తినకుండా మానేయాలన్న కష్టం. అయితే ప్రతి డైట్ ప్లాన్‌లో మనం ఇష్టపడే ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ లేకపోతే త్వరగా బరువు తగ్గుతారు. చాలా మంది బరువు తగ్గటానికి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గిస్తారు. ఏదేమైనా భారతీయ ఆహారంలో, ప్రధాన పిండి పదార్ధాలు బియ్యం, గోధుమలు. అన్నం, చపాతీ అనేవి భారతీయుల డైట్‌లో భాగమైపోయాయి. చాలా వరకూ మన ఆహారాలు గోధుమ ఆధారిత, బియ్యం ఆధారితమైనవి కాబట్టి, బియ్యం, చపాతీలను పూర్తిగా మానేయ్యడం సరైంది కాదు.

వైద్య సమస్యల కారణంగా వారి ఆహారం నుండి సోడియంను తొలగించాలని కోరుకునే వారికి చపాతీ చక్కటి పరిష్కారం. కానీ బరువు తగ్గడానికి చపాతీ ఎందుకు మంచిదంటే.. చపాతీతో పోలిస్తే అన్నంలో తక్కువ ఆహార ఫైబర్, ప్రోటీన్, కొవ్వు కలిగి ఉంటుంది. అన్నంలో అధిక కేలరీలు కలిగి ఉంటాయి, ఇది రెండు చపాతీలు ఇచ్చే సంతృప్తిని అందించదు. బరువు తగ్గటానికి ఎక్కువగా ఉపయోగించే ఆహారంలో చపాతీ ఒకటి. అయితే చాలా మంది అన్నానికి బదులుగా చపాతీ తీసుకుంటారు. అయితే చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బరువు తగ్గటానికి అన్నానికి బదులుగా చపాతీ తినడం మంచిదే. అయితే వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. చపాతీలని ఎక్కువగా కూడా తినకూడదు. బరువు తగ్గటానికి రోజుకి గరిష్టంగా నాలుగు చపాతీలు తినడం మంచిది.

చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులు చపాతీ మంచిది అని చెబుతారు. వీటిలో ఏది మంచిది. అన్నం కంటే గోధుమ పిండిలో మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా ఇది సహకరిస్తుంది. అన్నం కంటే చపాతీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్‌ ఉండటం వల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి.

గోధుమలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. చాలామంది రాత్రి పూట చపాతీ ఆరోగ్యానికి మంచిదని అంటారు. అయితే, ఒకవేళ రాత్రి మీ ఆహారంగా చపాతీ తినాలనుకుంటే, రాత్రి 7:30 గంటలకు ముందు తినేయడం మంచిదని చెబుతున్నారు వైద్యులు . అయితే మీ శరీరానికి ఏది బాగా సరిపోతుందో ముందుగా మీరు తెలుసుకోవడం అవసరం.

Chicken Rates Hike: చికెన్ ప్రియులకు ఊహించని షాక్.. తెలంగాణలో భారీగా పెరిగిన ధరలు.. కిలో చికెన్ ధర ఎంతంటే..?

దేత్తడి హారికకు భారీ షాక్.. టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె నియామక వివరాలు తొలగింపు

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!