AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!

టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన టీమిండియా మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.  రాబోయే టీ20 సిరీస్‌ను జయించటానికి రెడీ అవుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ 20

India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!
India vs England T20 Series Schedule
Sanjay Kasula
|

Updated on: Mar 11, 2021 | 4:20 PM

Share

India vs England T20 Series Schedule: టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన టీమిండియా మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది.  రాబోయే టీ20 సిరీస్‌ను జయించటానికి రెడీ అవుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ మార్చి 12 నుంచి ఇరు జట్ల మధ్య జరుగుతుంది. టీమిండియా తన విజయ పరంపరను ఇలాగా కొనసాగించాలని అనుకుంటోంది. ఇదిలావుంటే టెస్ట్ సిరీస్‌లో ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న ఇంగ్లాండ్ జట్టు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ఇక టీ 20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరుగనున్నాయి.

స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి..

కోవిడ్ ఆంక్షల కారణంగా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించని బీసీసీ యాజమన్యం.. ఈ టీ20 సిరీస్ చూసేందుకు అనుమతించింది. అయితే.. తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లను ఉపయోగించడం వంటి కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది. ఈ మ్యాచ్ ప్రత్యేక్షంగా చూసేందుకు టికెట్లను ‘బుక్‌ మై షో” వెబ్‌సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధర రూ. 500 నుంచి రూ.10 వేల మధ్య ఉంటుంది.

టీ20 సిరీస్ షెడ్యూల్ (T20 series schedule)

మొదటి టీ 20- మార్చి 12, రాత్రి 7 గం.

రెండవ టీ20- మార్చి 14, రాత్రి 7 గం.

మూడవ టీ20- మార్చి 16, రాత్రి 7 గం.

నాల్గవ టీ20- మార్చి 18, రాత్రి 7 గం.

ఐదవ టీ20- మార్చి 20, రాత్రి 7 గం.

టీమిండియా జట్టు సభ్యులు(Indian team) – విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, టి. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రాహుల్ తివాటియా మరియు వాషింగ్టన్ సుందర్.

నివేదికల ప్రకారం వరుణ చక్రవర్తి, రాహుల్ యో-యో ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక పోయారు. మొదటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ జట్టులోకి రానున్నాడు. చాహర్ చాలా కాలంగా స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టుతో బయో బబుల్‌లో ఉన్నాడు.

ఇంగ్లాండ్ జట్టు సభ్యులు(England team) ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, క్రిస్ జోర్డాన్, టామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్ మరియు రీస్ టోప్లీ.

టెలికాస్ట్ మరియు స్ట్రీమింగ్ (Telecast and Live Streaming)

ఇండియా-ఇంగ్లాండ్ టీ -20 ఐ సిరీస్, స్టార్ స్పోర్ట్స్ యొక్క వివిధ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఫిక్చర్స్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు జియో టీవీలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే టీవీ9 కూడా లైవ్ బ్లాగ్‌లో స్కోర్ అప్‌డేట్‌ను అందిస్తోంది.. ఇందు కోసం..www. tv9telugu.com ఇక్కడ క్లిక్ చేయండి…

ఇవి కూడా చదవండి…

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

కిసాన్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తోంది.. వడ్డీ రేటు ఎంత..! సులభంగా ఎలా తీసుకోవాలో ఇక్కడ చదవండి..!

Vijay Hazare Trophy: పాకిస్తాన్‌పై కోహ్లీ చేసిన రికార్డుకు బ్రేక్ పడింది.. పరుగుల వరద పారించిన షా..