Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!
Gunathilaka Out: అదే సమయంలో పోలార్డ్ బంతిని అందుకునేందుకుని ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గుణతిలక చూడకుండా తన కాలితో బంతిని..
Danushka Gunathilaka Given Out: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ ధనుష్క గుణతిలక అనుకోని విధంగా ఔటయ్యాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు మొదటి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింంది. అయితే కరుణరత్నే 52 పరుగులు చేసి పెవెలియన్ దారి పట్టగా.. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఔటయ్యాడు. 21వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన విడీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ రెండో బంతికే ఓపెనర్ కరుణరత్నేను ఔట్ చేశాడు. బౌలింగ్ వేసిన పోలార్డ్ పట్టిన అద్బుమైన క్యాచ్‌తో ఔటయ్యాడు.
What can’t Captain Polly do!? #WIvSL #MenInMaroon #cgcoralisle
Live Scorecard pic.twitter.com/OVTqiVHEmt
— Windies Cricket (@windiescricket) March 10, 2021
ఇక ఆ తర్వాత పోలార్డ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడిన గుణతిలక పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో నాన్ స్ట్రైయికర్ పథుమ్ నిశాఖ ముందుకు రావడంతో.. అతడిని వెనక్కి వెళ్లమని చెప్పడానికి ముందుకు వచ్చాడు. అయితే అదే సమయంలో పోలార్డ్ బంతిని అందుకునేందుకుని ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గుణతిలక చూడకుండా తన కాలితో బంతిని తన్నడంతో లెగ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌ను కోరాడు. అయితే థర్డ్ అంపైర్ ఔట్ అంటూ నిర్ణయించాడు.
Out or not?#WIvSLpic.twitter.com/zsFkfr5n69
— ESPNcricinfo (@ESPNcricinfo) March 11, 2021
గుణతిలక ఉద్దేశపూర్వకంగానే ఫీల్డింగ్‌కు అడ్డొచ్చాడని భావించి ఔట్‌గా ప్రకటించింది. గుణతిలక పెవెలియన్ దారిపట్టిన తర్వాత శ్రీలంక వరుస వికెట్లను కోల్పోయింది. 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిని చవిచూసింది. ఇందులో థర్డ్ అంపైర్ తీసుకున్న గుణతిలక ఔట్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.