AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిసాన్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తోంది.. వడ్డీ రేటు ఎంత..! సులభంగా ఎలా తీసుకోవాలో ఇక్కడ చదవండి..!

ICICI Bank Kisan Credit Card: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వివిధ రకాల వ్యవసాయ రుణాలను అందిస్తుంది. వ్యవసాయ ఖర్చులకు సంబంధించిన ప్రయోజనాలను ఇలా తెలుసుకోండి...

కిసాన్ క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తోంది.. వడ్డీ రేటు ఎంత..! సులభంగా ఎలా తీసుకోవాలో ఇక్కడ చదవండి..!
Sanjay Kasula
|

Updated on: Mar 10, 2021 | 5:58 PM

Share

ICICI Bank Agriculture Loan: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వివిధ రకాల వ్యవసాయ రుణాలను అందిస్తుంది. వ్యవసాయ ఖర్చులకు సంబంధించిన ప్రయోజనాలను పొందడానికి బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ఈ సదుపాయం యొక్క ప్రయోజనాన్ని వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ పనిముట్లు, పశువులు, నీటిపారుదల పరికరాలు కొనుగోలు చేయడానికి ఈ రుణాలను అందిస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డును కూడా జారీ చేస్తుంది. దీని సహాయంతో వ్యవసాయానికి సంబంధించిన పనిని బలోపేతం చేయవచ్చు.

రిటైల్ అగ్రి లోన్ కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా కిసాన్ కార్డ్ ఇవ్వబడుతుంది. ఇది రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్రెడిట్ కార్డు. ప్రతిరోజు వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులను పరిశీలించవచ్చు. రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా రుణాలు అందిస్తున్నారు. అంతే కాకుండా, దీర్ఘకాలిక రుణాలు మరియు అగ్రి టర్మ్ రుణాలు కూడా ఈ బ్యాంక్ అందిస్తోంది.

టర్మ్ లోన్ యొక్క ప్రయోజనం

టర్మ్ లోన్ల సహాయంతో, రైతులు పశువుల పెంపకం కోసం పశువులను కొనుగోలు చేయవచ్చు. వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేయవచ్చు. నిర్ణీత కాల పరిమితి రుణాలను ఐసిఐసిఐ బ్యాంక్ రైతులకు ఇస్తుంది. ఈ రుణాన్ని 3-4 సంవత్సరాలలో తిరిగి చెల్లించవచ్చు. దీని కోసం రైతులు నెలవారీ, హాఫ్ ఇయర్లీ లేదా వార్షిక వాయిదాలను రుణం చెల్లించేందుకు ఉపయోగించుకోవచ్చు.

పేపర్ వర్క్ లేకుండానే..(Easy & Convenient Loan)

ఈ రుణం పొందడానికి ఎక్కువ పేపర్ వర్క్ లేకుండానే అందిస్తున్నారు. రైతులు తమ ఆదాయాన్ని బట్టి తిరిగి చెల్లించే కాలాన్ని ఎంచుకోవచ్చు. రుణం తీసుకోవటానికి ఏమాత్రం సంకోచించకుండా రుణంపై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదనపు ఫైన్లు కూడా లేవు. రుణాలు ఇవ్వడానికి ప్రాసెసింగ్ కూడా సులువుగా పూర్తి అవుతుంది.

బ్యాంక్ ఏటిఎంతో ప్రయోజనం

ఐసిఐసిఐ బ్యాంక్ దేశవ్యాప్తంగా శాఖలున్నాయి. వీటితోపాటు ఏటీఎం వ్యవస్థను కూడా కల్గివుంది. వీటిలో రైతులు తమ కేడిట్ కార్డులను చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. తమ పంటకు కాల్సిన డబ్బును ఇక్కడ నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంది.  వ్యవసాయ అవసారాలకు ఈ కార్డును  క్రెడిట్  పరిమితికి అనుకూలంగా వినియోగించుకునే అకాశం ఉంది.

క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే…(No hidden charges)

కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి అవసరమైన కొన్ని అర్హతలు ఇలా ఉన్నాయి. ఈ  కార్డుకు 18-70 ఏళ్ల రైతుకు అర్హత ఉండాలి. క్రెడిట్ కార్డు పొందాలనుకునే రైతుకు సొంత భూమి ఉండాలి. రైతు వ్యవసాయం లేదా దాని సంబంధిత పనులలో పాలుపంచుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డు కోసం, మొదట దరఖాస్తు ఫారమ్ నింపాలి. అతనితో కెవైసి పేపర్లు ఇవ్వాలి.

తీసుకునేందు ఇలా చేయండి.. (Simplified Documentation)

కిసాన్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, రైతు భూమి పత్రాలను అందించాల్సి ఉంటుంది. మరికొన్ని పత్రాలను బ్యాంకు అధికారులు మీ నుండి అడగవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కనీస వడ్డీని 8.70% నుంచి గరిష్టంగా 13.60%  ఉంటుంది. ప్రీమియం ఓవర్‌డ్రాఫ్ట్‌పై కనీస వడ్డీ 8.75% ,  గరిష్టంగా 14.00% ఉంటుంది. అదేవిధంగా, అగ్రి టర్మ్ లోన్‌పై కనీస రుణం 9.5% మరియు గరిష్టంగా 15.10% ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

ఒక్కసారి చెల్లిస్తే.. జీవితకాలం పెన్షన్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రణాళిక.. ఎలానో తెలుసా..