IPL 2021: ఆర్సీబీకి కొత్త వికెట్ కీపర్.. డొమెస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపిన ప్లేయర్.. అతడేవరంటే.!
IPL 2021: ఐపీఎల్ 2021కి ముందు విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్..
IPL 2021: ఐపీఎల్ 2021కి ముందు విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఫిన్ ఆలిన్‌ను టీంలోకి తీసుకుంది. 20 లక్షలతో ఫిన్ ఆలిన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కొనుగోలు చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కొన్ని అనివార్య కారణాలు కారణంగా ఫిలిప్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైనా సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఫిలిప్.. 5 మ్యాచ్‌లలో 78 పరుగులు చేశాడు.
ఫిన్ ఆలిన్ రికార్డులు…
న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఫిన్ ఆలిన్ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో మొత్తం 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఫిన్ 48.81 స్ట్రైక్ రేట్‌తో 537 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ టోర్నీలో వెలింగ్టన్ జట్టుకు ఓపెనర్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు లిస్టు-ఏ క్రికెట్‌లో 512 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 6 అర్ధ సెంచరీలు, ఒక శతకం ఉంది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడటంతో ఫిన్ ఆలిన్ దిట్ట అని చెప్పవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!