Covid vaccine: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్రధాని తల్లి హీరాబెన్.. ట్విట్ చేసిన పీఎం మోదీ..

Heeraben Modi receives Corona vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు

Covid vaccine: కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ప్రధాని తల్లి హీరాబెన్.. ట్విట్ చేసిన పీఎం మోదీ..
Follow us

|

Updated on: Mar 11, 2021 | 4:08 PM

Heeraben Modi receives Corona vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మార్చి 1న రెండో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటినుంచి ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ త‌ల్లి హీరాబెన్ మోదీ కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. గురువారం గుజారాత్‌లో ఆమె వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ప్రధాని మోదీ తన ట్విట‌్టర్ ద్వారా వెల్లడించారు. మా అమ్మ ఈ రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. వ్యాక్సిన్‌కు అర్హత కలిగిన మీ చుట్టు పక్కల వారిని అందరూ ప్రోత్సహించాలని సూచిస్తున్నానంటూ మోదీ ట్వీట్‌ చేశారు. కాగా ప్రధాని మోదీ కూడా ఈ నెల 1న కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

దేశ‌వ్యాప్తంగా కరోనావ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు గురువారం మధ్యాహ్నం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది. ముందుగా జనవరి 16 నుంచి వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైన వారికి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు.

Also Read:

Covid Vaccination: ఎన్నికల సంఘం చర్యలు.. ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో తొలగింపు..

‘దయచేసి నిగ్రహంతో వ్యవహరించండి’, ఆసుపత్రి బెడ్ పై నుంచి మమత సందేశం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?