ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా 1,400 డాలర్లు జమ.. ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం..!
దాదాపు 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 220-211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.
US covid package : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతకాదు. జగజ్జీత సంస్థలు సైతం ఆర్థికమాంధ్యంతో విలవిలలాడాయి. దీంతో అయా దేశాలు కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఘోరకలిని చవిచూసిన అగ్రరాజ్యం ఉత్పాదక రంగాలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో అంగీకరించింది. ఇందులో భాగంగా ఇటీవల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ కరోనా ఆర్ధిక ఫ్యాకేజీకి ఓకే చెప్పారు.
దాదాపు 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు 220-211 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇప్పటికే ఈ బిల్లును సెనేట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రతినిధుల సభలో కూడా బిల్లు పాస్ కావడంతో ఇది బైడెన్‌కు దక్కిన భారీ విజయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడిందనేది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా, కరోనాతో చతికిలపడిన అమెరికన్లను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కాంగ్రెస్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపారు.
ఈ బిల్లుపై బైడెన్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు పంపించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేస్తారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి పేర్కొన్నారు. బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. దీంతో ఈ బిల్లు అమలులోకి రానుంది. ఇక, బిల్లు అమలైతే అమెరికా పౌరులకు భారీ ఉపశమనం దొరుకుతుంది. తద్వారా వారికి ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు లభించనున్నాయి. దీంతో కోవిడ్ మహమ్మారిపై పోరుకు నిధులను వెచ్చించనున్నారు.
ఇదిలావుంటే, అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఈ ఉద్దీపన ప్యాకేజీ అమలులోకి వస్తే సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందించనున్నారు. దీంతో ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడిగా ఖాతాలో నేరుగా 1,400 డాలర్లు జమ కానున్నాయి. అలాగే, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక బలోపేతానికి 350 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు. నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున భృతి ఇవ్వనున్నారు. మరోవైపు, అమెరికా పౌరులకు కొవిడ్-19 టీకా, టెస్టుల కోసం 50 బిలియన్ డాలర్లు కేటాయిస్తారు.
Read Also.. అంతరిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం… ముల్లంగిని పండించిన నాసా