అంతరిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం… ముల్లంగిని పండించిన నాసా
అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్... నాసా మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో పర్యటించే వ్యోమగాముల ఆకలి తీర్చడానికి... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముల్లంగిని పెంచుతున్నట్లు తెలిపింది.
Follow us
ఇతర గ్రహాలపై వ్యవసాయ సాగుబడికి సిద్ధమవుతున్న నాసా… ఇందులో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పంటలు పండించి విజయం సాధించింది.
అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్… నాసా మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో పర్యటించే వ్యోమగాముల ఆకలి తీర్చడానికి… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముల్లంగిని పెంచుతున్నట్లు తెలిపింది.
అంతరిక్షంలో మొక్కల పెంపకానికి అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ ఏర్పాటు చేశారు. ఇది మొక్కలు సొంతగా పెరగడానికి అనువుగా ఉన్న గ్రోత్ ఛాంబర్‌ను రూపొందించారు.
అంతరిక్షంలో వ్యోమగాములు తీసుకునే ఆహారం చాలా ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారవుతుంది. వీటిలో నీటి శాతాన్ని చాలా వరకూ తగ్గించి వీలైనంత ఎక్కువ కాలం అవి నిల్వ ఉండేలా చేస్తారు. దీందతో అంతరిక్షంలో తాజా ఆహారం తినే వీలు కలుగుతుంది.
సెల్ఫ్ కంటైన్ట్ గ్రోత్ ఛాంబర్లో మైక్రోగ్రావిటీలో మొక్కలను పెంచడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లిన శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధన చేస్తున్నారు.
ఈ పరిశోధనలో ఎరుపు, నీలం రంగు లైట్లకు మొక్కలు మెరుగ్గా స్పందిస్తున్నాయనే విషయం కూడా తెలిసింది.
జీరో గ్రావిటీలో మొక్కలు పెంచుతున్న సంగతి ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ (ESA) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. `పిల్లోస్` అనే చతురస్రాకారపు బాక్సుల్లో విత్తనాలు నాటడం వల్ల వేర్లకు నీరు, ఎరువు సమానంగా అందించడానికి సాధ్యమవుతుంది.