AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daytona Beach Bike Rally: ఫ్లోరిడాలో డేటో బీచ్‌ బైక్ ర్యాలీ…ఈవెంట్‌లో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా

కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. అమెరికన్లు వెనక్కి తగ్గడం లేదు. ఫ్లోరిడాలో ఏటా జరిగే డేటో బీచ్‌ బైక్ ర్యాలీ దుమ్ము రేపుతోంది. కలర్‌ఫుల్ మోడళ్లు, రకరకాల బైకులతో మోత పుట్టిస్తోంది.

Daytona Beach Bike Rally: ఫ్లోరిడాలో డేటో బీచ్‌ బైక్ ర్యాలీ...ఈవెంట్‌లో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా
ఫ్లోరిడాలో ఏటా జరిగే డేటో బీచ్‌ బైక్ ర్యాలీ
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2021 | 9:31 PM

Share

కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. అమెరికన్లు వెనక్కి తగ్గడం లేదు. ఫ్లోరిడాలో ఏటా జరిగే డేటో బీచ్‌ బైక్ ర్యాలీ దుమ్ము రేపుతోంది. కలర్‌ఫుల్ మోడళ్లు, రకరకాల బైకులతో మోత పుట్టిస్తోంది. ఈ ఈవెంట్‌లో 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా. అంతా బాగానే ఉన్నా.. జనం ఎక్కువగా రావడంతో కోవిడ్ కేసులు పెరుగుతాయోమోనని ఆందోళన చెందుతున్నారు అధికారులు.

ఫ్లోరిడాలో బాగా పాపులర్ ఈవెంట్ డేటోనా బీచ్ బైక్‌ ర్యాలీ. ప్రతీ ఏటా వారం రోజులపాటు బీచ్‌లో పండగ రేంజ్‌లో సెలబ్రేట్ చేస్తారు బైకర్లు. ప్రతీ సంవత్సరం ఈ ఈవెంట్‌కు 5లక్షల మంది వస్తుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా 3లక్షల మంది వస్తారని భావిస్తున్నారు. మాడలింగ్ చేసిన బైకులు, రీ షేప్ చేసిన టూవీలర్లు, త్రీ వీలర్లు, వాటి మీద ఆజాను బాహులైన బైక్ రైడర్లు, వాళ్ల వెనుక కళ్లు తిప్పుకోనివ్వని మోడళ్లు.. వారం రోజుల పాటు డేటోనా బీచ్ అంతా కలర్‌ఫుల్‌గా మారిపోతుంది. ఇందులో బైక్‌ రేసులు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, బైక్‌షోలు జరుగుతాయి. ప్రస్తుతం ఫ్లోరిడాలో జరుగుతున్న బైక్ ర్యాలీ ఆదివారం ముగియనుంది. ఈ ర్యాలీ ప్రారంభమై ఈ ఏడాది 80 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. దీంతో బైక్ ర్యాలీని చూసేందుకు జనం భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉండటంతో ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్న రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతాయేమో అనే ఆందోళన కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో సౌత్‌ డకోటాలో జరిగిన బైక్ ర్యాలీకి నాలుగున్నర లక్షల మంది వచ్చారు. వీరిలో చాలా మంది మాస్కులు కూడా పెట్టుకోలేదు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. ఈ ర్యాలీ తర్వాత రాష్ట్రమంతటా కోవిడ్ కేసులు పెరిగాయి.

దీంతో ఈ ఏడాది జరగాల్సిన బైక్ ర్యాలీని క్యాన్సిల్ చేయాలని ఒక దశలో భావించారు. అయితే స్థానికులతో పాటు బైక్ రైడర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కరోనా విస్తరించకుండా డేటోనా బీచ్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీచ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్‌ సెంటర్లలోనూ 60 శాతం మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఫ్లోరిడాలో మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలనే నిబంధన గతేడాది సెప్టెంబర్‌లోనే తీసేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన కూడా ఇక్కడ లేదు. సెప్టెంబర్ నుంచే ఫ్లోరిడాలో బార్లు, రెస్టారెంట్లు ఫుల్ కెపాసిటీతో నడుపుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బైక్ వీక్ ప్రారంభమైన తర్వాత బిజినెస్ పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. బైక్ ర్యాలీ వీక్ వల్ల వలూసియా కౌంటీలోని హోటళ్లలో చాలా కాలం తర్వాత ఆక్యుపెన్సీ పెరిగింది. ర్యాలీకి తీసుకు వచ్చిన కొన్ని బైకులు ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బైక్ ర్యాలీ వల్ల 75 మిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుందని అంచనా.

Also Read:

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే

Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్