Extra-Marital Affairs: గత కొంతకాలంగా భారతీయ మహిళల్లో మార్పు..పెళ్ళైనా వేరే వ్యక్తులతో ప్రేమ.. సర్వేల్లో షాక్

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కుటుంబానికి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఒక్కసారి పెళ్లి అయ్యి కొత్తబంధంలోకి అడుగు పెట్టిన తర్వాత కుటుంబానికి అత్యతం ప్రాధాన్యతనిస్తూ.. ఇల్లాలుగా, కోడలు, అమ్మ గా...

Extra-Marital Affairs: గత కొంతకాలంగా భారతీయ మహిళల్లో మార్పు..పెళ్ళైనా వేరే వ్యక్తులతో ప్రేమ.. సర్వేల్లో షాక్
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2021 | 5:05 PM

Extra-Marital Affairs Survey : భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కుటుంబానికి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఒక్కసారి పెళ్లి అయ్యి కొత్తబంధంలోకి అడుగు పెట్టిన తర్వాత కుటుంబానికి అత్యతం ప్రాధాన్యతనిస్తూ.. ఇల్లాలుగా, కోడలు, అమ్మ గా బహురూపాల్లో తన బాధ్యతలనునివర్తిస్తారు. అయితే మన దేశంలో వివాహేతర సంబంధం పెట్టుకోవడం బహు అరుదు అనే నమ్మకం ఇంతవరకూ..పెళ్లి అయినా వేరే వ్యక్తితో డేటింగ్ అనేది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంటుంది అని ఇప్పటివరకూ అందరూ భావించేవారు. అయితే ఇటీవల ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లోనూ వివాహిత సంబంధాలకు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయం ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది.

మహిళలు డెవలప్ చేసిన ఓ డేటింగ్ యాప్ ను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ను మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్నారు. అయితే ఈ డేటింగ్‌ యాప్‌కు భారత్ లో 13 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఆ యాప్‌ ఇటీవల ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భారత్ లో బాగా చదువుకుని, ఆర్థికంగా ఎవరిమీద ఆధారపడని మహిళలు ఎక్కువగా వివాహేతర బంధాన్ని కలిగి ఉన్నారని తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారట. వీరిలో సుమారు 48 శాతం మంది మహిళలు తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. వారిలో చాలామందికి పెళ్ళవడమే కాదు పిల్లలు కూడా ఉన్నారట.. ఈ విషయాన్నీ వారు సర్వేలో చెప్పారట..

64శాతం మహిళలు తాము వ్యక్తిగత శృంగార జీవితాన్ని భర్తలతో ఎంజాయ్ చేయలేకపోతున్నామని..చెప్పారట. వారిలో 76 శాతం మంది బాగా చదువుకున్న వారు కాగా, 72 శాతం మంది ఆర్థికంగా స్వతంత్రత కలిగి ఉన్నవారని వెల్లడైంది. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 1525 మందిపై ఆ సర్వే చేశారు. అందులో 48 శాతం మంది ఒకరి కన్నా ఎక్కువ మందితో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించారు. అయితే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకెలా మారుతుందో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.

Also Read:

దాడుల తర్వాత కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం.. సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

భారత్‌లో అడుగు పెట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన కొత్త స్ట్రెయిన్ .. కర్ణాటకలో తొలికేసు నమోదు